చైనాపై మౌనమెందుకు?: సోనియా
చైనా ఆక్రమణల విషయంలో పార్లమెంటులో ప్రస్తావించేందుకు ప్రభుత్వం అడ్డుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను ఈ అంశంపై మాట్లాడేందుకు అనుమతించట్లేదని.. ప్రభుత్వం ఎందుకు మౌనం పాటిస్తోందని ఆమె ప్రశ్నించారు. ‘చైనా నుంచి దాడుల్ని ఎదుర్కొనేందుకు భారత సన్నద్ధత ఏంటి? భవిష్యత్తులో వీటిని నిలువరించడానికి ప్రణాళికలు ఏంటి? అనే అంశాలపై ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఇలాంటి దేశభద్రతకు సంబంధించిన అంశాలపై మౌనం వహించడం ప్రభుత్వ సహజ లక్షణంగా మారిపోయింది’ అని ఆమె దుయ్యబట్టారు.