హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్ములా రేసింగ్ పోటీలు తొలిరోజు అర్ధంతరంగా నిలిచిపోయాయి. రేసింగ్‌లో రెండు సెషన్స్ మాత్రమే జరిగాయి. [రేసింగ్](url) సమయంలో రెండు కార్లు రేసింగ్ మధ్యలో ఆగిపోవడంతో గందరగోళం నెలకొంది. ప్రాక్టీస్ రేస్‌లతోనే తొలి రోజు ముగించారు. కాగా ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి దృష్టి నెలకొంది. శనివారం రేసింగ్ వీక్షించడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. వర్షం సూచనలు కూడా ఉండడంతో ప్రేక్షకులు ఇక్కడికి రావడానికి మొగ్గు చూపటంలేదు.