• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!

    నేషనల్‌ క్రష్‌ రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కన్నడలో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ (Kirik Party)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కఠినమైన పాత్రలను కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన జీవితంలో సాధించిన ఘనతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. అలాగే ఆమె లేటెస్ట్‌ చిత్రాలు ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుండి విడుదలైన రష్మిక పోస్టర్లపైనా ఓ లుక్కేద్దాం. 

    ఫోర్బ్స్‌ జాబితాలో అగ్రస్థానం

    ఈ ఏడాది ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ‘ఫోర్బ్స్‌ ఇండియా 30 అండర్‌ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది. దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది.

    తొలి ఇండియన్‌గా గుర్తింపు

    తెలుగు, తమిళ, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన ‘ఒనిట్సుకా టైగర్‌ ఫ్యాషన్‌’ సంస్థకు ‘బ్రాండ్‌ అడ్వకేట్‌’గా ఎంపికైంది. ఆ సంస్థకు బ్రాండ్‌ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్‌ భారతీయురాలు తానేనని రష్మిక స్వయంగా వెల్లడించింది. 

    ఏకైక నటి రష్మికనే

    రష్మిక తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘సెప్టిమిస్ అవార్డ్స్’ నామినేషన్స్‌లో రష్మిక నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో మన దేశం నుంచి రష్మిక మందన్న నిలవడం విశేషం.

    తొలి సెలబ్రెటీగా రికార్డు

    ఇటీవల టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్‌ అనిమే’ (Crunchyroll Anime)  అవార్డులకు నేషనర్‌ క్రష్‌ రష్మిక హాజరైంది. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీగా రష్మిక రికార్డు సృష్టించింది. దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు.

    సోషల్‌మీడియాలోనూ రికార్డు

    యంగ్‌ బ్యూటీ రష్మిక మందన్న ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. దీంతో సోషల్‌ మీడియాలో ఆమెకు గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్‌ దక్కించుకుంది. ఆతర్వాత సమంత 33 మిలియన్లు, పూజా హెగ్డె 26.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.

    శ్రీవల్లి.. మెస్మరైజ్‌ లుక్‌

    అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందిస్తున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. కాగా, ఇవాళ రష్మిక బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్‌ అదిరిపోయే పోస్టర్‌ను లాంచ్ చేసింది. శ్రీవల్లి పాత్రకు సంబంధించిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చీరలో దట్టంగా వేసిన నగలతో చాలా అందంగా కనిపించింది. 

    కాలేజీ స్టూడెంట్‌గా అదుర్స్‌!

    రష్మిక నటిస్తున్న మరో లేటెస్ట్‌ మూవీ ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ (The Girlfriend). నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ (Rahul Ravindran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫస్ట్‌ పోస్టర్‌ కూడా ఇవాలే విడుదలై నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇందులో రష్మిక పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లను దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ తన ఎక్స్ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ఇందులో రష్మిక చాలా క్లాస్‌ లుక్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. క్యూట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv