గుజరాత్, చెన్నై మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ని రెండు జట్లు ఉపయోగించుకున్నాయి. తొలి ఇన్నింగ్స్ ముగిశాక తొలుత చెన్నై కెప్టెన్ ధోనీ ఈ సదుపాయాన్ని వాడుకున్నాడు. అంబటి రాయుడు స్థానంలో బౌలర్ తుషార్ దేశ్‌పాండేని తీసుకున్నాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ కూడా సాయికిశోర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటి? దీనిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం.
ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి బీసీసీఐ ఈ నయా రూల్‌ని తీసుకొచ్చింది. తుది జట్టులోని 11 మంది కాకుండా బెంచ్‌పై ఉన్న వారిలోంచి ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేసుకోవచ్చు. మ్యాచ్‌కు ముందు 11మంది ఆటగాళ్లతో పాటు ఆయా జట్లు ఐదుగురు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భారత ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఈ ఐదుగురిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకోవచ్చు.
* ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకోవచ్చు. ఓవర్ పూర్తయ్యాక, వికెట్ పడ్డాక, రిటైర్డ్ హర్ట్ అయ్యాక ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు.
* ఇంపాక్ట్ ప్లేయర్‌గా వస్తే పూర్తిగా బ్యాటింగ్ చేయొచ్చు. బౌలర్ అయితే పూర్తి స్పెల్ వేయొచ్చు.
* బ్యాటింగ్ చేసిన ఆటగాడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకుంటే మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి వీలుండదు. బౌలింగ్ మాత్రమే చేయాలి. ఒకవేళ బ్యాటింగ్ చేయని ప్లేయర్ స్థానంలో వస్తే బ్యాటింగ్ చేయొచ్చు.
* ఒక వేళ విదేశీ ప్లేయర్‌ని తీసుకోవాలంటే తుది జట్టులో ముగ్గురు మాత్రమే ఓవర్‌సీస్ ప్లేయర్లు ఉండాలి.
* కొన్ని ఓవర్లు వేసిన బౌలర్ స్థానంలో మరో బౌలర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకుంటే పూర్తి కోటా ఓవర్లు(4) వేయొచ్చు.
* ఇంపాక్ట్ ప్లేయర్ గాయపడితే మాత్రం మరో ఇంపాక్ట్ ప్లేయర్‌ని తీసుకోవడానికి వీలు లేదు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌ని తీసుకోవచ్చు.
* ఫుట్‌బాల్, బేస్ బాల్, బాస్కెట్ బాల్, రగ్బీలలో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన అమలులో ఉంది.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది