చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘పోకో’ (Poco) మరో సరికొత్త బడ్జెట్ మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘పోకో సీ61’ (Poco C61) పేరుతో ఈ నయా ఫోన్‌ను అతి త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో విడుదలైన ‘Poco C51’ మెుబైల్‌కు అనుసంధానంగా ఈ ఫోన్ భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. అయితే విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రధాన ఫీచర్లు ఆన్‌లైన్ ప్రత్యక్షమయ్యాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
మెుబైల్ స్క్రీన్
Poco C61 మెుబైల్.. 6.71 అంగుళాల HD+ LCD స్క్రీన్‌తో రానున్నట్లు తెలుస్తోంది. దీనికి 90Hz రిఫ్రెష్ రేట్, 500 nits పీక్ బ్రైట్‌నెస్, Gorilla Glass 3 ప్రొటెక్షన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ MediaTek Helio G36 SoC ప్రొసెసర్‌పై పనిచేయనున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ర్యామ్ & స్టోరేజ్
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. Poco C61 మెుబైల్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో రానుంది. లాంచింగ్ రోజున మిగిలిన స్టోరేజ్ ఆప్షన్స్‌పై స్పష్టత వచ్చే అవకాశముందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. microSD కార్డ్ సాయంతో స్టోరేజ్‌ను పెంచుకునే వీలు కూడా ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
కెమెరా
లీకైన సమాచారాన్ని బట్టి ఈ నయా పోకో మెుబైల్.. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. ఫోన్ వెనక భాగంలో 8MP ప్రైమరి కెమెరా + 0.08 MP సెకండరి సెన్సార్ ఉంటుందని అంచనా. ఇక ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వీటి ద్వారా నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
బ్యాటరీ
Poco C61 మెుబైల్ పవర్‌ఫుల్ బ్యాటరీతోనే రానున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్‌కు 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5,000mAh బ్యాటరీని ఫిక్స్ చేశారని సమాచారం. ఇది మెుబైల్‌కు లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ పోకో మెుబైల్‌లో.. Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, GALILEO, BDS, USB Type-C 2.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ (Side Mounted Fingerprint Sensor), యాక్సిలోమీటర్ (Accelerometer), కాంపస్ (Compass) వంటి సెన్సార్లు కూడా ఫోన్‌తో పాటు రానున్నాయి.
ధర ఎంతంటే?
Poco C61 మెుబైల్ ధర, విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే వచ్చేనెల ప్రారంభంలో ఈ ఫోన్ భారత మార్కెట్‌లో అడుగుపెట్టనుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ 4GB+64GB వేరియంట్ ధర రూ. 7,499గా ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.