• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Poco X6 Neo: మీడియం రేంజ్‌లో అదిరిపోయే ఫోన్‌ను తీసుకొచ్చిన పోకో.. ధర, ఫీచర్లు ఇవే!

    ప్రముఖ టెక్‌ కంపెనీ పోకో (Poco) మార్కెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ మొబైల్‌ను కంపెనీ ‘పోకో ఎక్స్‌6 నియో’ (POCO X6 Neo) మోడల్‌ పేరుతో ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎంతో శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్‌తో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోని అత్యాధునిక ఫీచర్లు టెక్‌ ప్రియులను ఆకట్టుకుంటాయని పోకో వర్గాలు ధీమాగా ఉన్నాయి. కొత్తగా ఫోన్‌ కొనాలని భావించే వారికి తమ మెుబైల్‌ తప్పక నచ్చుతుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో POCO X6 నియో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    Poco X6 Neo మెుబైల్‌.. 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి 1080 x 2400 pixels రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్‌, 1,000 nits peak brightness అందించారు. ఈ ఫోన్‌ Android 14 OS, Mediatek Dimensity 6080 ప్రొసెసర్‌పై పని చేస్తుంది. Octa-core సీపీయూ, Mali-G57 MC2 జీపీయూ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ పోకో మెుబైల్‌ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. 8GB RAM / 128GB ROM, 12GB RAM / 256GB స్టోరేజ్‌తో ఆప్షన్లలో పొందవచ్చు. ర్యామ్‌ను 24GB వరకూ వర్చువల్‌గా పెంచుకోవచ్చని కంపెనీ తన స్పెసిఫికేషన్స్‌లో పేర్కొంది.

    బ్యాటరీ

    Poco X6 Neo మెుబైల్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో లాంచ్‌ చేశారు. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన Li-Po 5000mAh నాన్‌ రిమూవబుల్‌ బ్యాటరీని మెుబైల్‌కు ఫిక్స్ చేశారు. ఇది మెుబైల్‌ను చాలా ఫాస్ట్‌గా ఛార్జ్‌ చేయడంతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. USB Type C సాయంతో మెుబైల్‌ను ఛార్జ్‌ చేసుకోవచ్చు. 

    కెమెరా 

    ఈ నయా పోకో మెుబైల్‌లో ప్రధానంగా ఆకర్షిస్తున్న ఫీచర్‌ కెమెరా. దీనిని డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఇందులో ఏకంగా 108MP ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే 2MP డెప్త్‌ సెన్సార్‌ను ఫిక్స్ చేశారు. ముందువైపు సెల్ఫీ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ మెుబైల్‌ ద్వారా నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని పోకో కంపెనీ పేర్కొంది. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Poco X6 Neo మెుబైల్‌…Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, GALILEO, BDS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే సైడ్‌ మౌంటెండ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, యాక్సిలోమీటర్‌ (accelerometer), గైరో (gyro), ప్రాక్సిమిటీ (proximity), కాంపస్‌ (compass) సెన్సార్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

    కలర్ ఆప్షన్స్

    ఈ నయా మెుబైల్‌ను పోకో మూడు కలర్‌ వేరియంట్లలో లాంచ్ చేసింది. అస్ట్రాల్‌ బ్లాక్‌ (Astral Black), హారిజాన్‌ బ్లూ (Horizon Blue), మార్టియన్ ఆరెంజ్‌ (Martian Orange) రంగుల్లో ఈ ఫోన్‌ను పొందవచ్చు. 

    ధర ఎంతంటే?

    పోకో ఎక్స్‌6 నియో మెుబైల్‌ ధరను వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.15,999 కాగా.. 12జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.17,999గా కంపెనీ పేర్కొంది. ఇవాళ సాయంత్రం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు మొదలయ్యాయి. HDFC, SBI, Axis Bank కార్డు కొనుగోలుపై ఫ్లిప్‌కార్టు ఆఫర్లు కూడా అందిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv