దేశంలోని అగ్ర కథనాయికల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ప్రభాస్. నిలకడగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తూ తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఏ కథనాయకుడికి అందనంత ఎత్తులో డార్లింగ్ నిలిచాడు. అటువంటి ప్రభాస్‌కు ఏ తెలుగు హీరోకు దక్కని అరుదైన గౌరవం లభించనున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేసేలా ఓ డాక్యుమెంటరీ రూపొందనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది.
సమగ్ర సమాచారంతో డాక్యుమెంటరీ!
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee 5) ప్రభాస్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వర్క్‌ను కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. అందుకోసం ప్రభాస్ సొంత ఊరైన మొగల్తూరుకు వెళ్ళి అక్కడ గ్రామస్థులతో డాక్యుమెంటరీ బృందం మాట్లాడనుందట. అలాగే ప్రభాస్‌తో చేసిన నటులు, డైరెక్టర్లు, ఫ్రెండ్స్ అభియాలను కూడా వీడియోల రూపంలో సేకరించనుందట. అందుకు ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దాదాపు వచ్చే ఏడాది ఆఖరిలో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రభాస్ డాక్యుమెంటరీపై ఇప్పటినుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది.
రాజమౌళిపై సైతం
దర్శకధీరుడు రాజమౌళి సాధించిన ఘనతలపై ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సైతం ఓ డాక్యుమెంటరీ చేసింది. ‘మోడ్రన్ మాస్టర్స్’ (Modern Masters) పేరుతో ఆగస్టు 2 నుంచి దీనిని స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చారు. ప్రభాస్, రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌లు రాజమౌళితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పని విషయంలో ఆయన ఎంత కఠినంగా ఉంటారో కూడా ఫన్నీగా తెలియజేశారు. అటు రాజమౌళి భార్య రమా రాజమౌళి, సంగీతం దర్శకుడు కీరవాణి సైతం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీకి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రాజమౌళి సినిమాలలాగే ఆయన వ్యక్తిత్వం కూడా ఇంత గొప్పగా ఉంటుందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.
ప్రభాస్‌కు విలన్‌గా గోపిచంద్!
ప్రభాస్, గోపిచంద్ మధ్య మంచి ప్రెండ్షిప్ ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులుగా చేసిన వర్షం సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటీవల విశ్వం మూవీ ప్రమోషన్స్ సందర్భంగా గోపిచంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌కు విలన్‌గా చేసే ఛాన్స్ వస్తే నటిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో ఫౌజీ దర్శకుడు హను రాఘవపూడి రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీలో వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే గోపిచంద్ మాత్రం తన నిర్ణయాన్ని తెలియజేయలేదని టాక్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందని సమాచారం.
ప్రభాస్ బర్త్‌డే కానుక
ప్రభాస్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘ఈశ్వర్’. 22ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మాస్ హీరోగా ప్రభాస్‌కి గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది. జయంత్ సి.పరాంజీ ప్రభాస్‌లోని మాస్ యాంగిల్‌ని తొలి సినిమాతోనే అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఈశ్వర్’ చిత్రం గ్రాండ్‌గా రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ని కొత్తగా కట్ చేసి రిలీజ్ చేశారు. ‘రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్’ అంటూ వదిలిన ‘ఈశ్వర్’ ట్రైలర్ ఇప్పడు అందర్నీ ఆకట్టుకుంటోంది.