• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ram Charan: ‘గేమ్‌ ఛేంజర్‌’ సెట్‌ నుంచి రామ్‌చరణ్‌ ఫొటోస్‌ లీక్‌.. వైజాగ్‌లో చెర్రీ క్రేజ్‌ మామూల్గా లేదుగా !

    మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ (Ram Charan).. టాప్‌ గేర్‌లో దూసుకెళ్లున్నాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఆయన క్రేజ్‌ గ్లోబల్‌ స్థాయికి చేరింది. ప్రస్తుతం చరణ్‌.. గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ’ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్‌చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు మెుదలయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తాజాగా సెట్‌లో రామ్‌చరణ్‌ లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    వైజాగ్‌లో షూటింగ్‌

    ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా చివరి దశ షూటింగ్‌ను మేకర్స్‌ వైజాగ్‌లో ప్లాన్ చేశారు. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్‌కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను ఆర్‌కే బీచ్‌లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్‌లో రామ్ చరణ్, ఎస్‌.జే సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. బహిరంగ షూటింగ్ కావడంతో సెట్స్‌లోని చరణ్ ఫోటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోల్లో రామ్ చరణ్.. చాలా స్టైలిష్‌గా జెంటిల్‌మెన్ లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ఐఏఎస్ పాత్రకి సంబంధించినదని సమాచారం. నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి. 

    చరణ్‌కు ఘన స్వాగతం

    వైజాగ్‌ షూటింగ్‌ నేపథ్యంలో.. నిన్ననే రామ్‌చరణ్‌, తమిళ నటుడు ఎస్‌.జే సూర్యతో పాటు ప్రధాన తారాగణం అంతా వైజాగ్‌ చేరుకుంది. వైజాగ్‌ ఎయిర్‌పోర్టుకు రామ్‌చరణ్‌ వస్తున్నట్లు ముందే తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి వెళ్లారు. చరణ్‌ ఎయిర్‌పోర్టులో దిగగానే కేరింతలు కొట్టారు. చరణ్‌ నినాదాలతో ఎయిర్‌పోర్టును మార్మోగించారు. తమ అభిమాన హీరోపై పూల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

    చరణ్‌ బర్త్‌డే రోజున స్పెషల్‌ సాంగ్‌

    రామ్‍చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. మార్చి 27వ తేదీన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం నుంచి తొలి పాట రానుంది. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (SS Thaman) ఇటీవలే ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. ‘జరగండి.. జరగండి’ పాటని ఆ రోజున విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దీపావళికి ఈ పాటను తీసుకొస్తామని ప్రకటించి మూవీ టీమ్ వాయిదా వేసింది. ఇప్పుడు చెర్రీ పుట్టిన రోజున ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఈ పాటతోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమా రిలీజ్ డేట్ కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

    ‘RC 16’ చిత్రానికి ముహోర్తం ఫిక్స్‌!

    ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌.. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ‘RC16’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. మార్చి 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఆ కార్యక్రమంతో ఈ సినిమా షురూ అవుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. 

    మూవీ టైటిల్ అదేనా!

    రామ్‍చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్‍ను కూడా ఖరారు చేసినట్టు సినీ సర్కిల్‍లో టాక్ వినిపిస్తోంది. దీనిపై పూజా కార్యక్రమం రోజున అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. ఉత్తరాంధ్ర సైడ్ ‘పెద్ది’ అంటే పెద్ద అని అర్ధం. ఇప్పటికీ చాలామంది ముసలివారిని, పెద్దవారిని ‘మా పెద్ది’ అని బంధువులు, కుటుంబ సభ్యులు పిలుస్తూ ఉంటారు. కథ కూడా టైటిల్‌కు మ్యాచ్‌ అయ్యేలా ఉండటంతో ఆ పేరునే సినిమాకు ఫిక్స్‌ చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ టైటిల్‌ను ఎన్టీఆర్‌ కోసం బుచ్చిబాబు అనుకున్నారని గతంలో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఆ టైటిల్‌నే రామ్‌చరణ్‌కు తీసుకున్నట్లు వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv