భారీ అంచనాలతో ఐపీఎల్-2023 సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఓడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి ఐపీఎల్‌లో బోణి కొట్టాలని SRH భావిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ టీమ్‌ను లీడ్ చేయగా, రెండో మ్యాచ్ నుంచి సౌతాఫ్రికా బ్యాటర్ మార్‌క్రమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు.
ఇవాళ్టి మ్యాచ్‌కు కోసం కెప్టెన్ మార్‌క్రమ్‌తో పాటు దక్షిణాఫ్రికా ప్లేయర్లు మార్కో జాన్సెన్, హెన్రిక్ క్లాసేన్ జట్టులో చేరారు. వీరి రాకతో సన్‌రైజర్స్ బలమైన జట్టుగా మారింది. అదే ఉత్సాహాంతో LSGతో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో చేతిలెత్తేసిన SRH బ్యాటర్లు.. మార్‌క్రమ్ నాయకత్వంలో విజృభించాలని భావిస్తున్నారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ తొలి మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. ఇవాళ కూడా అతడు రాణిస్తాడని జట్టు భావిస్తోంది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి క్రితం మ్యాచ్‌లో విఫలం కాగా తప్పులను సరిదిద్దుకొని రాణించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. గ్లెన్ ఫిలిప్స్, హ్యారీ బ్రూక్ లాంటి హిట్టర్లతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్ కూడా ఇవాళ్టి మ్యాచ్‌లో రాణిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదనే చెప్పాలి.
ఇక సన్‌రైజర్స్ బౌలింగ్ విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫారుఖీ దారుణంగా విఫలమయ్యారు. పదికి పైగా ఎకానమీతో బౌలింగ్ చేసి రన్స్ సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో రాణించాలని భువీ, ఫారుఖీ చూస్తున్నారు. అటు నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్‌తో SRH బౌలింగ్ దుర్భేధ్యంగా ఉంది. గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన ఉమ్రాన్ మాలిక్‌పై ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలున్నాయి. తొలి మ్యాచ్‌లో ఒక వికెట్ మాత్రమే తీసిన ఉమ్రాన్ LSGతో మ్యాచ్‌లో మరిన్ని వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాలని సన్‌రైజర్స్ జట్టు ఆశిస్తోంది.
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఎంతో బలంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన LSG.. CSKతో జరిగిన క్రితం మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని LSG భావిస్తోంది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ కైల్ మేయర్స్‌పై రాహుల్ సేన ఎక్కువగా ఆధారపడుతోంది. LSG ఆడిన రెండు మ్యాచుల్లోనూ మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే మ్యాచ్‌కు సౌతాఫ్రికా వికెట్ కీపర్ డీకాక్ అందుబాటులో ఉంటాడు. అతడి రాక కేఎల్. రాహుల్‌తో పాటు సెలెక్టర్లకు కొత్త సమస్యను తీసుకొచ్చింది. డీకాక్ స్థానంలో గత రెండు మ్యాచ్‌లు ఆడిన కైల్ మేయర్స్ అద్భుతంగా రాణించాడు. దీంతో అతడి స్థానంలో డీకాక్‌ను తీసుకొస్తారా లేదా జట్టులో ఉన్న ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ నికోలస్ పూరన్, స్టోయిన్స్‌లో ఒకరిని పక్కన పెడతారా అన్నది ఆసక్తికరం. దీనిపై లక్నో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మ్యాచ్ ప్రారంభం వరకూ ఆగాల్సిందే.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం