సుజుకీ కంపెనీ ఉత్పత్తి చేసే మోటర్ సైకిల్స్‌ను దేశీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు, నయా డిజైన్లతో సుజుకి కొత్త బైక్స్‌ను విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ కంపెనీ భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించింది. అయితే సుజుకి కొత్తగా మరో రెండు బైక్‌లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఒకటి Suzuki GSX-S1000GX కాగా, మరొకటి Suzuki GSX-8R బైక్. ఇందులో ప్రధానంగా Suzuki GSX-S1000GX బైక్‌కు సంబంధించిన ఫీచర్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
పవర్‌ఫుల్ ఇంజన్
GSX-S1000 సిరీస్‌లో అందించిన పవర్‌ఫుల్ ఇంజన్‌తో GSX-S1000GX మోటార్‌సైకిల్ రానుంది. ఇది స్పోర్ట్ రైడింగ్ కోసం ఎక్స్‌లెంట్ పర్ఫామెన్స్ అందిస్తుంది. టాప్ నాచ్ టూరింగ్ కేపబిలిటీస్ కోసం కొత్త టెక్నాలజీ, డివైజ్‌లు కూడా ఆఫర్ చేస్తుంది. బైక్ అగ్రెసివ్ డిజైన్‌తో రావడమే కాక సుదూర ప్రయాణానికి సౌకర్యవంతమైన అప్‌రైట్ రైడింగ్ పొజిషన్‌ను అందిస్తుంది.
డైనమిక్ సస్పెన్షన్
GSX-S1000GX బైక్ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ (SAES)తో వస్తోంది. ఇది మంచి రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. వెహికల్ స్పీడ్, రోడ్డు కండిషన్స్ ఆధారంగా సస్పెన్షన్‌ను బైక్ ఎలక్ట్రానిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. తద్వారా రోడ్లపై డైనమిక్ స్పోర్ట్ పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది.
ఎలక్ట్రానిక్ కంట్రోల్స్
GSX-S1000GX బైక్ SAES సస్పెన్షన్‌తో పాటు పవర్ క్యారెక్టర్‌స్టిక్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్లు, డంపింగ్ సెట్టింగ్స్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోసం SDMS సిస్టమ్ వంటి ఎలక్ట్రానిక్ కంట్రోల్స్‌తో వస్తుంది. ఇది మోషన్ ట్రాక్ బ్రేక్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తుంది. కార్నర్స్‌లో లీన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ABSని యాక్టివేట్ చేయగలదు. ఈ అడ్వాన్స్డ్ ఫీచర్లు.. GSX-S1000GXని బెస్ట్ బైక్‌గా నిలబెడుతుందని సుజుకి చెబుతోంది.
GSX-8R బైక్ ఫీచర్లు
GSX-8R బైక్‌ను అన్ని వయసుల రైడర్ల కోసం సుజుకి తీసుకొస్తోంది. సుజుకి GSX-8S బైక్‌కు అనుసంధానంగా దీనిని లాంచ్ చేయబోతోంది. స్పోర్ట్స్ రైడింగ్ కోసం ఈ బైక్‌కు ఫెయిరింగ్, డిఫరెంట్ హ్యాండిల్‌బార్స్‌ను అందజేశారు. ఈ బైక్.. 776 cm3 పారల్లెల్ 2 సిలిండర్ ఇంజన్‌తో మెరుగైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఫిట్ ఫ్రేమ్, అలాగే పెద్ద పిస్టన్‌లతో కూడిన సస్పెన్షన్‌ను రైడర్లు పొందుతారు.
ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్
GSX-S1000GX, GSX-8R రెండు సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (S.I.R.S.) ఫీచర్లతో రానున్నాయి. GSX-S1000GX బైక్ SDMS-α సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. ఈ సిస్టమ్ సస్పెన్షన్ డంపింగ్, ట్రాక్షన్ కంట్రోల్, పవర్ ఔట్‌పుట్ ఫీచర్స్‌పై ఇంటిగ్రేటెడ్ కంట్రోల్‌ను ఆఫర్ చేస్తుంది.
ధర ఎంతంటే
GSX-S1000GX బైక్‌ను సుజుకి డిసెంబర్‌లో రిలీజ్ చేయనుంది. GSX-8R బైక్‌ను వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ చేసేందుకు సమాయత్తమవుతోంది. ఈ బైక్స్ ధరలను సుజుకి అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ GSX-S1000 మోటర్ సైకిల్ రూ.12 లక్షలు, Suzuki GSX-8S ధర రూ.10-11లక్షల వరకూ ఉండొచ్చని ఆటోమెుబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Celebrities Featured Articles
Revanth Reddy: సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్.. సినీ పెద్దల భేటిపై మరో నటి ఫైర్!