• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • స్టేడియంలోనే క్రికెటర్ల డ్యాన్స్

  మ్యాచ్ గెలిస్తే ఆ ఆనందమే వేరు. అయితే శ్రీలంక జట్టు మహిళలు ఓ అడుగు ముందుకేసి ఏకంగా స్టేడియంలోనే స్టెప్పులేశారు. మహిళల ఆసియాకప్‌ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక ఒక పరుగు తేడాతో గెలుపొందింది. దీంతో 14ఏళ్ల తర్వాత ఫైన‌ల్‌కి చేరామన్న ఆనందంతో.. ఓ పాట పెట్టుకుని మైదానంలోనే ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇదివరకే ఫైనల్ చేరిన భారత్‌తో టైటిల్ పోరులో లంకేయులు తలపడనున్నారు. ఆసియాకప్‌ 2022ని శ్రీలంక చేజిక్కించుకున్న అనంతరం, మహిళా జట్టు కూడా ఫైనల్ చేరడం గమనార్హం. #ApeKello celebrating in style … Read more

  థాయిలాండ్‌పై భారత్ ఘనవిజయం

  ఆసియా కప్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. థాయిలాండ్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ టీ-20 మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 37 పరుగులకే అలౌట్ చేసిన భారత్.. 6 ఓవర్లలలో ఒక వికెట్ కోల్పోయి ఆ టార్గెట్‌ను ఛేదించింది. భారత బ్యాటర్లలో మేఘన 20, పూజ వస్త్రాకర్ 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. స్కోర్లు: థాయిలాండ్ 37, భారత్: 40/1. వూమెన్ క్రికెట్ చరిత్రలో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.

  నేడు థాయ్‌లాండ్‌తో భారత్ ఢీ

  ఆసియాకప్‌లో నేడు భారత మహిళలు తుది లీగ్ మ్యాచ్‌ను ఆడనున్నారు. 3 వరుస విజయాలతో ఊపుమీదున్న థాయ్‌లాండ్‌తో నేడు తలపడనున్నారు. ఇప్పటికే భారత్ సెమీస్ చేరుకోగా.. వచ్చే ఏడాది టీ20ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ తిరిగి జట్టులో చేరితే బ్యాటింగుకి బలం చేకూరుతుంది. అటు థాయ్‌లాండ్‌నూ తక్కువ అంచనా వేయలేం. సెమీస్ బెర్త్ కోసం ఆ జట్టు శక్తివంచన లేకుండా పోరాడుతోంది. నేడు మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభం కానుంది.

  అగ్ర స్థానానికి టీమిండియా

  ఆసియా కప్‌లో భారత మహిళలు మళ్లీ పుంజుకున్నారు. పాక్ చేతిలో ఓటమి అనంతరం.. ఆతిథ్య బంగ్లాదేశ్‌ని మట్టి కరిపించారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. ఓపెనర్లు చెలరేగిన వేళ బంగ్లాకు 160పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. అనంతరం 100 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసింది. దీంతో 5 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సెమీస్ అవకాశాలను మరింత పదిలపరుచుకుంది. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా వరుసగా మూడింట్లో నెగ్గింది.

  యూఏఈని చిత్తు చేసిన భారత్

  ఆసియా కప్‌లో భారత క్రికెట్ మహిళల జట్టు పసికూన యూఏఈని చిత్తు చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 178/5 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (75), దీప్తిశర్మ (64) విజృంభించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 74 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్‌కు సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

  ASIA CUP: బోణీ చేసిన భారత్

  ఆసియా కప్‌లో భారత మహిళలు బోణీ చేశారు. శ్రీలంకపై 41 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బ్యాటింగులో రోడ్రిగ్స్(73) చెలరేగింది. అనంతరం భారత బౌలర్లు విజృంభించారు. 109 పరుగులకే లంకను కుప్పకూల్చి అదరగొట్టారు. దీప్తి శర్మ, పూజా, హేమలతల బౌలింగు దాడిని తట్టుకోలేక లంకేయులు విలవిలలాడారు. అక్టోబరు 3న భారత్ మలేసియాతో తలపడనుంది.

  AsiaCup: భారత మహిళల జట్టు ప్రకటన

  మహిళల ఆసియా కప్ 2022 సిరీస్‌కి భారత్ తన జట్టును ప్రకటించింది. 15మందితో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్. అక్టోబరు 1నుంచి 15వరకు బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. జట్టు వివరాలు. హర్మన్ ప్రీత్ కౌర్(c), స్మృతి మంధాన(Vc), దీప్తి శర్మ, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, మేఘన, రిచా ఘోష్, స్నేహ్ రానా, హేమలత, మేఘ్నా సింగ్, పూజా వస్త్రేకర్, రేణుక ఠాకూర్, రాజేశ్వరి, రాధా యాదవ్, నవ్‌గిరె.

  ఆసియా కప్ మొనగాళ్లు వీరే

  ఆసియా కప్‌లో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఫైనల్‌లో పాక్‌ను చిత్తు చేసి కప్పు గెలిచింది. కాగా 281 పరుగులు చేసి ఆసియా కప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా పాకిస్తాన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాాడు. ఆ తర్వాతి స్థానంలో 276 పరుగులతో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆసియా కప్‌ 2022లో సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కోహ్లి నిలిచాడు. అత్యధిక వికెట్ల జాబితాలో 11 వికెట్లతో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ మొదటి స్థానంలో, 9 వికెట్లు … Read more

  చెన్నై స్ఫూర్తితోనే విజయం సాధించాం: శనక

  ఆసియా కప్‌ను ఒడిసిపట్టిన శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ శనక తమ విజయ స్ఫూర్తి చెన్నై నుంచి వచ్చిందని తెలిపాడు. ‘2021లో చెన్నై జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి విజయం సాధించింది. అదే నా బుర్రలో ఉంది. మేము దానిపై చర్చించాము ’’ అని పేర్కొన్నాడు. ఆసియా కప్‌ టోర్నీ ఫైనల్‌కు ముందు జరిగిన 11 మ్యాచ్‌ల్లో మూడు సార్లు మాత్రమే తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్లు గెలిచాయి. ఫైనల్‌లో లంక తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. దీంతో చెన్నై మ్యాచ్‌ను గుర్తు తెచ్చుకుని అదే … Read more

  సీన్ రిపీట్ కానుందా!

  ఆసియా కప్ ట్రోఫీని ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంక ముద్దాడింది. చివరగా 2014లో లంక జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆశ్చర్యమేమిటంటే.. వెనువెంటనే జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్ నూ శ్రీలంక ఎగరేసుకుపోయింది. ఈ ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అవుతుందేమోనన్న కుతూహలం క్రికెట్ ప్రేమికుల్లో మొదలైంది. ప్రస్తుతం ఆ జట్టు నిండైన ఆత్మవిశ్వాసంతో ఉంది. అన్ని విభాగాల్లో మెరుగైంది. మరి ప్రపంచకప్ లో విజేతగా నిలుస్తుందో లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.