తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన ఉల్లి
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఉల్లి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి సెప్టెంబరుకి నాలుగు, ప్రస్తుతం రెండు కేజీలకి తగ్గింది. వర్షాలు సరిగాలేక కర్నూలు, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోనూ ఇదీ పరిస్థితి ఉండటమే కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ అధికారులు అన్నారు.