• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్

    టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య సరిస్థితిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం జైలు అధికారులు ప్రభుత్వ వైద్యుల సూచనలను పాటించేలా చూడాలని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. చంద్రబాబును చల్లని వాతావరణంలో ఉంచాలని ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు జైలు అధికారులకు సూచించారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    చంద్రబాబుకు పిటిషన్ డిస్మిస్

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. అలాగే సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కూడా డిస్మిస్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది.

    ‘స్కిల్‌లో స్కామ్ ఎక్కడుంది’

    చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపు లాయర్ ప్రమోద్ కుమార్ తన వాదనలు వినిపిస్తున్నారు. సీఐడీ తరపున ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రమోద్ వాదిస్తూ ‘స్కిల్ కేసులో చంద్రబాబుకు సంబంధం లేదు. రాజకీయ కక్ష్య తోనే ఆయనను ఈ కేసులో ఇరికించారు. ఒప్పందం ప్రకారం 40 స్కిల్ సెంటర్లు, 2లక్షల మందికిపైగా ఉద్యోగ శిక్షణ ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది. ఇందులో స్కామ్ ఎక్కడుంది’. అని చంద్రబాబు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.