• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సింపతీ కోసం చంద్రబాబు ప్లాన్: సజ్జల

    టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ మంజూరుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు బయటకు వచ్చారని తెలిపారు. ప్రజల్లో సింపతీ కోసమే చంద్రబాబు మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పారు. చంద్రబాబు బయట ఉన్నా లోపల ఉన్నా పెద్ద తేడా లేదన్నారు.హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

    ఆ రోజే చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ

    స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అక్టోబరు 27న ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నెల 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించి.. విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఫైబర్‌నెట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాది కోర్టు విచారణ జరిగేవరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను పొడిగించాలని కోరారు. అప్పటివరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని ఆయన సుప్రీంకోర్టుకు సూచించారు. ఈ మేరకు శుక్రవారం వరకు ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబను అరెస్టు చేయోద్దని సుప్రీం ఆదేశించింది.