చికెన్ లేదన్నందుకు హోటల్‌నే లేపేశారు
తాము ఆర్డర్ ఇచ్చిన చికెన్ రోల్ లేదన్నారని కొందరు రౌడీలు హోటల్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘటన బెంగళూరులోని హనుమంతనగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రౌడీషీటర్ దేవరాజ్, అతని అనుచరులు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లి చికెన్ రోల్ ఆర్డర్ చేశారు. మెనూలో చికెన్ రోల్ లేదని సిబ్బంది చెప్పారు. దీంతో దేవరాజ్ సిబ్బందితో గొడవకు దిగాడు. హోటల్ సిబ్బంది వారిని చితకబాది బయటికి పంపివేశారు. ఆ తర్వాత దేవరాజ్ పెట్రోల్ తీసుకువచ్చిహోటల్పై పోసి తగులబెట్టాడు.