• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తించదు: రోహత్గీ

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు మొదలయ్యాయి. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ‘అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A చంద్రబాబుకు వర్తించదు. స్కాం జరిగిన టైంలో సెక్షన్ 17ఏ లేదు. అవినీతిపరులకు సెక్షన్ 17ఏ రక్షణకవచం కాకుడదు. సెక్షన్ 17ఏ కేవలం నీతిమంతమైన ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుంది’ అని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో చివరగా చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించాల్సి ఉంది.

    తల్లిని కూడా కలవనివ్వరా?: భువనేశ్వరి

    ఏపీ పోలీసులు తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. రాజమండ్రిలో చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపట్టిన టీడీపీ కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అంటూ ప్రశ్నించారు. తనను కలిసేందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారు. తల్లిని కలిసేందుకు వస్తే తప్పేంటి అని ధ్వజమెత్తారు.

    చంద్రబాబు బెయిల్ విచారణ వాయిదా

    ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న మందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో అవినీతి జరిగిందని చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు విచారణను వాయిదా వేసింది.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    చంద్రబాబు పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు

    సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై వాడి వేడిగా వాదనలు జరుగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ‘ఈ కేసు మూలంలోనే తప్పు ఉంది. అన్నీ కలిపి ఒక ఎఫ్‌ఐఆర్ తయారు చేశారు. ఇందులోని ఎఫ్‌ఐఆర్ చట్టబద్దం కాదు. 164 కింద తీసుకున్న వాంగ్మూలం ఆధారంగా కేసును నిర్మించారు. దానిని సవాలు చేస్తున్నాం’ అని వాదించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. ‘చంద్రబాబుపై తగినన్ని ఆధారాలు లభించాక 2021లో సీఐడీ కేసు నమోదు చేసింది. 17A చట్ట … Read more

    చంద్రబాబు పిటిషన్‌ వాదనలు వాయిదా

    చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. అవినీతి నిరోధక చట్టం 17A ప్రకారం సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కచ్చితంగా గవర్నర్ అనుమతి అవసరమని చంద్రబాబు తరఫు లాయర్ హరీష్ సాల్వే కోర్టులో వాదించారు. చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో స్కిల్ స్కాం 2018లో జరిగిందని ఎక్కడా లేదన్నారు. 17ఏ ఈ కేసులో కచ్చితంగా వర్తిస్తుందని వాదించారు. వాదనలు విన్న న్యాయస్థానం మధ్యాహ్ననికి వాయిదా వేసింది. లంచ్ తర్వాత వాదనలు కొనసాగనున్నాయి.

    చంద్రబాబుకు గట్టి ఎదురు దెబ్బ

    చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్లు న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. అంగళ్ల అల్లర్ల, ఫైబర్‌ గ్రిడ్‌, ఐఆర్‌ఆర్‌ కేసుల్లో ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న 3 పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    సుప్రీంకోర్టులో నేడు చంద్రబాబు పిటిషన్ విచారణకు రానుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. ఈ కేసు ఐటెం నంబర్ 59గా లిస్టైంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఏ సేక్షన్‌ను అనుసరించి సీఎం స్థాయి వ్యక్తిని అరెస్ట్‌ చేసేటప్పుడు గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని లాయర్లు వాదిస్తున్నారు.

    చంద్రబాబు బెయిల్‌పై తీర్పు వాయిదా

    చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు. ఇదివరకే చంద్రబాబును కస్టడీకి అప్పగించినందునా మరోసారి కస్టడీకి ఇవ్వొద్దని చంద్రబాబు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును సోమవారానికి వాయిదా వేసింది.

    5 నుంచి భువనేశ్వరి బస్సు యాత్ర?

    చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టాలని యోచిస్తున్నారు. ఈనెల 5న కుప్పం నుంచి ప్రారంభించి రాయలసీమ జిల్లాల్లో కొనసాగించాలని ప్రణాళికలు వేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న భువనేశ్వరి.. టీడీపీ చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ ముందుకు సాగుతున్నారు. స్కిల్ స్కాం కేసులో కోర్టు తీర్పును అనుసరించి బస్సు యాత్రకు ప్లాన్ చేయనున్నట్లు తెలిసింది.