అమిత్‌షాతో పురందేశ్వరి భేటి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ భాజపా చీఫ్ పురందేశ్వరి భేటి అయ్యారు. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మద్యం కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన విషయాలపై హోం మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఓ మద్యం దుకాణంలో రూ.లక్ష వరకూ విక్రయాలు జరగ్గా.. కేవలం రూ.700కు మాత్రమే డిజిటల్ చెల్లింపులు జరిగాయని ఇటీవల పురందేశ్వరి ఆరోపించారు. మద్యం ద్వారా వచ్చిన నగదు వైకాపా నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు.