• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • తెలుగు సినిమాలో డేవిడ్‌ వార్నర్‌?

  IPLలో సన్‌రైజర్స్‌ జట్టుకు సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా ఉండి, జట్టుకు అనితర సాధ్య విజయాలను అందించి… హైదరాబాద్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు డేవిడ్‌ వార్నర్‌. ఫ్యాన్స్‌ అతడిని డేవిడ్‌ భాయ్‌ అని పిలుచుకుంటారు. క్రికెట్‌తోనే గాక తెలుగు సినిమా రీల్స్‌, వీడియోస్‌తో వార్నర్‌ తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు. అయితే ఇటీవల టెస్టులో డబుల్‌ సెంచరీ అనంతరం రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ తాను ఈ యేడాది జరిగే వన్డే వరల్డ్‌ కప్‌ ఆడాలని భావిస్తున్నానని, కానీ జట్టు తన సేవలు చాలనుకుంటే రిటైర్‌ అవుతానని … Read more

  దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వార్నర్?

  రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, కోలుకోవడానికి కనీసం 6 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. దీంతో దిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరా? అన్న చర్చ మొదలైంది. అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పృథ్వీషా, మనీష్ పాండే, మిచెల మార్ష్‌లకు కూడా కెప్టెన్సీ అనుభవం ఉంది. కానీ, వార్నర్ సారథ్యంపైనే దిల్లీ యాజమాన్యం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 2016 సీజన్‌లో వార్నర్ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్ కప్పు కొట్టింది. … Read more

  విమర్శలకు డబుల్‌ సెంచరీతో సమాధానమిచ్చిన వార్నర్

  ఏడాది కాలంగా కెరీర్‌ పరంగా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. కెప్టెన్సీపై ప్రశ్నలు…ఫామ్‌పై విమర్శలు.. ఫిట్‌నెస్‌పై ఎత్తిపొడుపులు..అసలు జట్టులో ఉంటాడా అని అనుమానాలు..కానీ.. అన్నింటికి ఒక్క డబుల్‌ సెంచరీతో సమాధానమిచ్చాడు. అతడే డేవిడ్‌ వార్నర్‌. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టెస్ట్‌ మ్యాచ్‌లో తన వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వార్నర్‌ అద్భుత ద్విశతకాన్ని సాధించాడు. గాయమైనా వెరవకుండా పట్టుదలతో ఆడి 254 బంతుల్లో 200 పరుగులు చేశాకనే మైదానాన్ని వీడాడు.

  100వ టెస్టులో వార్నర్ 100

  ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫామ్ కొనసాగుతోంది. సౌతాఫ్రికాపై ఆడుతున్న తన 100వ టెస్టులో సెంచరీ కొట్టాడు. ఈ ఘనత సాధించిన చాలా తక్కువ మందిలో ఒకిరిగా నిలిచాడు. మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై వార్నర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం ఎత్తివేయాలని కోరినా స్పందించడం లేదన్నాడు. దీంతో వార్నర్ కాస్త నిరాశకు లోనయ్యాడని..ఎలా ఆడతాడో అని అనుకున్నారు. కానీ, ఒత్తిడిని జయించి 100 పరుగులు సాధించాడు.

  ఆసీస్ బోర్డుపై వార్నర్ అసంతృప్తి

  ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ దేశ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను కెప్టెన్ కావడం బోర్డుకే ఇష్టం లేనట్లు అర్థమవుతోందని వార్నర్ ఆవేదన చెందాడు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు తీరు వల్ల మానసిక వేధనకు గురై.. ఆట తీరుపై ప్రభావం చూపుతోందని వెల్లడించాడు. ‘కెప్టెన్‌ బ్యాన్ తీసేయాలని అప్పీల్ చేసుకున్నా. కానీ, బోర్డు బహిరంగ విచారణ చేస్తానంది. నేను వ్యక్తిగతంగా ఇస్తానన్నా. సహచర ఆటగాళ్ల నుంచి మద్దతు ఉన్నా.. బోర్డుకు ఇష్టం లేనట్లుంది’ అని వార్నర్ అభిప్రాయపడ్డాడు. 2018లో బాల్ ట్యాంపరింగ్ … Read more

  టాప్‌-5 సెంచరీ వీరులు వీళ్లే

  అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులకు పెట్టింది పేరు విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లందరికంటే అత్యధిక సెంచరీలు చేశాడు. 71 సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా..అతడి దరిదాపుల్లో కనీసం ఒక్క ప్లేయర్ కూడా లేడు. కోహ్లీ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్‌ 44 సెంచరీలతో 2వ స్థానంలో ఉన్నారు. తర్వాత 41 శతకాలతో రోహిత్ శర్మ, 40 సెంచరీలతో స్టీవ్ స్మిత్ టాప్-5లో స్థానం సంపాదించుకున్నారు.

  నేను క్రిమినల్‌ని కాదు: వార్నర్

  ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్‌పై విధించిన జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేసేందుకు వీలుగా ప్రామాణిక నిబంధనలను క్రికెట్ ఆస్ట్రేలియా మార్చిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘నేనేమీ క్రిమినల్‌ని కాదు. ప్రతి ఒక్కరికి అప్పీల్ చేసుకునే హక్కు ఉంది. 2018లో జరిగింది ఒక పీడకలలా మమ్మల్ని వెంటాడుతోంది. ఆ ఘటన తర్వాత ఎంతో పశ్చాత్తాప పడ్డాను. కఠినంగా శ్రమించి జట్టులోకి మళ్లీ రాగలిగా. ఏదేమైనా కడకు నిజాయితీగా ఉండడం గురించే ఆలోచిస్తా’ అని వార్నర్ తన మనసులోని ఆక్రందనను బయట పెట్టాడు. … Read more

  వార్నర్ కోసం.. రూల్స్ మార్చిన సీఏ

  టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమిచ్చి గ్రూప్ దశలోనే వెనుదిరిగిన ఆస్ట్రేలియా ఆలోచనలో పడింది. దీంతో టీ20 జట్టుకి కెప్టెన్‌గా వార్నర్‌ని నియమించాలని యాజమాన్యం యోచిస్తోంది. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా అతడు కెప్టెన్సీపై జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నాడు. తాజాగా వార్నర్‌కి లైన్ క్లియర్ చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్‌ని మార్చింది. జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న ప్లేయర్ ముగ్గురు సభ్యుల ప్యానెల్‌‌లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రస్తుత కెప్టెన్‌ ఆరోన్ ఫించ్ కెరీర్‌లోనే దయనీయ ఫామ్‌లో ఉన్నాడు.

  రష్మిక మందనాకు సారీ చెప్పిన వార్నర్

  ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమాలో ఓ సాంగ్‌ను స్పూఫ్ చేశాడు. రష్మిక మందనా ఫేస్‌ను తన ముఖంగా మార్చాడు. దాంతో నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ‘వాటే బ్యూటీ’పాటలోని.. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. అమ్మ అయ్యా ఇంట్లో ఎవరూ లేరు’ అనే లిరిక్స్‌ను ఎడిట్ చేశాడు. రష్మిక ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఇమిటేట్ చేశాడు. ఈ వీడియో చేసినందుకు రష్మిక మందన్నకి సారీ అంటూ కామెంట్ కూడా … Read more

  టెస్టులకు గుడ్‌ బై చెప్పనున్న డేవిడ్‌ వార్నర్‌

  ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌, హైదరాబాదీల ప్రియమైన డేవిడ్‌ భాయ్… టెస్ట్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశముంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న డేవిడ్ వార్నర్‌…తాను క్రికెట్‌ నుంచి తప్పుకోవాల్సి వస్తే తొలుత అది టెస్ట్‌ క్రికెట్‌ అవుతుందని వార్నర్‌ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో మరో ఏడాది కొనసాగాలని భావిస్తున్నట్లు చెప్పాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం 2024 టీ20 వరల్డ్‌ కప్‌ వరకూ కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశాడు. 36 ఏళ్ల వార్నర్‌ ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఘోరంగా విఫలమయ్యాడు.