సర్జికల్ స్ట్రైక్స్‌పై దిగ్విజయ్ వ్యాఖ్యల దుమారం
సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సైనికులను కాంగ్రెస్ అవమానిస్తోందంటూ బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ స్పందిస్తూ…. దిగ్విజయ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదన్నారు. అది వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. బలగాల సామర్థ్యానికి తమకు రుజువులు అవసరం లేదని రాహుల్ అన్నారు. దిగ్విజయ్ కూడా తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ తనకు రక్షణ దళాల పట్ల అమితమైన గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.