యాదాద్రిలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆమె యాదాద్రికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రమంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఆమెకు స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు ఆమె తిరుగు పయనమయ్యారు. రాష్ట్రపతి వెంట తమిళనాడు గవర్నర్ తమిళిసై కూడా యాదాద్రికి విచ్చేశారు.