కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల
బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..