ఓటర్ల జాబితాలో మీ పేరుందా?
ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే అందులో మీపేరు ఉందో లేదో పరిశీలించేందుకు ఉన్న మార్గాలివి. ప్రభుత్వ కాల్‌సెంటర్‌కు కాల్ చేస్తే వారు లైన్‌లో ఉంచి జాబితాలో పేరు ఉన్నదీ లేనిదీ చెప్తారు. 1950కి కాల్ చేస్తే జిల్లాలోని ఎన్నికల విభాగంలోని కాల్ సెంటర్‌కు వెళుతుంది. వారికి పేరు, నియోజకవర్గం చెబితే చాలు జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ తెలుపుతారు. అలాగే ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, బూత్ నంబరు కూడా తెలియజేస్తారు.