ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 7 నుంచి మొదలుకొని నవంబర్ 30 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచారం చేయడం, ఫలితాలు ప్రచురించడం వంటివి చేయరాదని హెచ్చరిచింది. నిబంధనల్ని ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని ఈసీ స్పష్టంచేసింది.