• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు. వరదలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన చెందారు. ‘దయచేసి కేటీఆర్‌ గారిని అడుగుతున్నా. ఒక్క హెలికాప్టర్ పంపించండి. రెస్క్యూ టీం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నా తరలింపు చర్యలు పూర్తి కావట్లేదు. 9 గంటల నుంచి హెలికాప్టర్ కోసం వేడుకుంటున్నాం. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’ అంటూ సీతక్క కోరారు. ఏటూరు నాగారం మండలంలో కొండై గ్రామస్థులు దాదాపు 100 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆమె తెలిపారు. Please send helicopters to save our … Read more

    నీటిపై తేలియాడుతున్న కార్లు

    గుజరాత్‌లో వానలు దంచికొట్టడంతో భారీ వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలు కురవడంతో రాజ్‌కోట్, సూరత్, గిర్ జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో కాలనీల్లో నిలిపి ఉంచిన కార్లు వర్షపు నీటిలో తేలియాడుతూ కొట్టుకుపోయాయి. రోడ్లపై ఎటు చూసినా కార్లే కనిపిస్తున్నాయి. కాగా వర్షాల ధాటికి గుజరాత్‌లో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాకపోకలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 43 రిజర్వాయర్లకు హై అలెర్ట్ ప్రకటించారు. గుజరాత్‌లో భారీ వర్షాలు సౌరాష్ట్ర ధోరజిలో వర్షానికి వాహనాలు నీట మునిగాయి.#GujaratRain pic.twitter.com/1QowPLAHBQ — Telugu Scribe (@TeluguScribe) July 19, 2023

    ఉప్పొంగిన వరద.. నీటమునిగిన ఢిల్లీ

    దేశ రాజధాని ఢిల్లీని వరద ముంచెత్తింది. అతి భారీ వర్షాలతో యమునా నది ఉప్పొంగి వరదలు పొటెత్తాయి. దీంతో ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుపోయాయి. రహదారులపై దాదాపు మనిషి ఎత్తు వరద పారుతోంది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. ఢిల్లీలోని ఎర్రకోట చుట్టూ వరద నీరు చేరింది. రోడ్లపై ఉన్న వాహనాలన్నీ నీట మునిగాయి. దీంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. #WATCH | A rickshaw-puller pedals through chest-deep water in the … Read more

    హోమంత్రి ఇంట్లోకి వరద నీరు

    ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు గజగజ వణికిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. హర్యానాలో వరదలు కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర హోం మంత్రిని కూడా వరదలు వదల్లేదు. అంబాలాలో ఉంటున్న హోం మంత్రి అనిల్ విజ్‌ ఇంట్లోకి వరద నీరు చేరింది. దీంతో ఆయన బయటకు కదలలేకుండా లోపలే ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌లలోనూ వరదలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారాయి. హర్యానాలో బీజేపీ హోం మినిస్టర్ ఇంట్లోకి వరద నీరు అంబాలా – హర్యానాలో కురుస్తున్న భారీ … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వరదలు

    ఉత్తరాదిని వరదలు వణికిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అతి భారీ వరద ముప్పు ఉందని ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. నదులు, వాగులు పొంగి భవనాలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో 243 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో వైపు యమునా నది ఉగ్రరూపం దాల్చి ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. Pray for Himachal Pradesh Monsoon rains … Read more

    ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు, వరదలు

    భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌, జమ్ము కశ్మీర్‌లో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. చీనాబ్, యమున, బియాస్ నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలు, వరదల కారణంగా 19 మంది మరణించారు. చాలా మంది వరదల్లో చిక్కుకుపోయి సహాయం కోసం అర్థిస్తున్నారు. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ వానలు ఆగట్లేదు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. #WATCH | Under the impact of incessant rainfall in Himachal Pradesh, Lagghati … Read more

    వరదలో కొట్టుకుపోయిన కార్లు

    హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, ఉత్తరాఖండ్‌లను వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్‌లో భారీ వర్షాలకు అయిదుగురు మృతి చెందారు. మనాలీలో వరద ప్రవాహంలో పలు కార్లు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లో ఓ కారు.. గంగా నదిలో పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. జమ్మూ-కశ్మీర్‌లోని దోడా ప్రాంతంలో బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. Several cars washed away in Manali#HimachalPradesh pic.twitter.com/IcJmdIJ0mn — Weatherman Shubham (@shubhamtorres09) July … Read more

    టర్కీలో భూకంపం వచ్చిన చోటే వరదలు

    [VIDEO:](url) భూకంప వినాశనం నుంచి కోలుకోక ముందే టర్కీని వరదలు ముంచెత్తాయి. ఫిబ్రవరిలో భూంకంపం సంభవించిన చోటే ఇలా పెను వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల తాకిడికి సాన్లిఉర్ఫా నగరంలో 11 మంది, అడియామన్‌లో ఇద్దరు మృతి చెందారు. బురదతో కూడిన భారీ వరదలకు వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఇటీవలి భూంకపంతో నిరాశ్రయులై పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఈ వరదలు శాపంగా మారాయి. భూకంపం కారణంగా దాదాపు 48వేల మందికి పైగా మృతిచెందారు. Several injured & killed after massive floods … Read more

    ప్రాణాలకు తెగించి వరదలో సాహసం

    ఒమన్‌లో ఈ ఏడాది సంభవించిన వరదల్లో ఇద్దరు చిన్నారులను ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా కాపాడిన వ్యక్తితో ఆ పిల్లలకు ఎలాంటి సంబంధమూ లేదంట. అందరూ తొలుత వారి తండ్రి అయ్యుంటాడేమనని ఊహించారు. కానీ, వారిని కాపాడిన వ్యక్తి ఓ ఫొటోగ్రఫర్‌గా గుర్తించారు. దీంతో ఆ ఫొటోగ్రఫర్ అల్ బిన్ నాసర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రాణాలకు తెగించి కాపాడటం గొప్ప విషయం’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. https://twitter.com/TheFigen_/status/1605624951540576256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1605624951540576256%7Ctwgr%5E436d9f3b843d42639f459af8b6f86e670847fcb5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fman-saves-children-drowning-oman-flash-flood-real-hero-1511972

    వాట్ యాన్ ఐడియా సర్‌జీ

    వర్షం, వరదలు వచ్చినప్పుడు పాదచారులను రహదారికి ఇవతల నుంచి అవతల వైపు తీసుకెళ్లటానికి ఓ వ్యక్తి ఏకంగా ఒక ట్రాలీనే తయారు చేసుకున్నాడు. దానిపై పాదచారులను రోడ్డుకు అటు, ఇటు చేరవేస్తున్నాడు. పాదచారుల బూట్లు, చెప్పుులు తడవకుండా ట్రాలీలో వారిని గమ్యానికి చేరుస్తున్నాడు. అందుకు అతను కొంత మొత్తం తీసుకుంటున్నాడు. ఇతని ఐడియాకు ఫిదా అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో స్పందించారు. ‘వ్యాపార ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపలేరు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ … Read more