‘ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌కు శ్రీకాంతాచారి పేరు’
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ బ్రిడ్జికి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు పెట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాగా 760 మీటర్ల పొడవుతో.. 12 వెడల్పుతో రూ.32 కోట్లు వెచ్చించి ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. చింతల్‌కుంట నుంచి మాల్ మైసమ్మ వరకు ఈ వారధి నిర్మించారు. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలు ఇకపై సిగ్నల్ ఫ్రీగా వెళ్లవచ్చు. నాలుగు దిక్కుల నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా నేరుగా వెళ్లవచ్చు.