గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి: కేటీఆర్
బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఒక పార్టీకి మద్దతుగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గవర్నర్ తమిళిసైతో ఇబ్బందులు తలెత్తిన వేళ కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. “ బ్రిటీష్ కాలంనాటి పేర్లు, చట్టాలను ప్రధాని తొలగిస్తున్నారు. రాచరిక వ్యవస్థను మార్చాలని చెబుతున్న ఆయన… బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను కూడా రద్దు చేయాలి. విభజన హామీలు అమలు చేయాలి “ అన్నారు.