• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

  రూ.1000 కోసం ఓ యువకుడు హోర్డింగ్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రవీందర్‌ అనే వ్యక్తి పెయింటింగ్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఓ వ్యక్తి అతడికి రూ.వెయ్యి ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. దీంతో రవీందర్ హోర్ఢింగ్ ఎక్కి డబ్బు ఇప్పించాలంటూ హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సిబ్బంది ద్వారా అతడిని కిందకు దింపారు. యువకుడికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

  ప్రియుడిపై కోపంతో ప్రేయసి ఆత్మహత్య

  ప్రియుడిపై కోపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జైపూర్‌కు చెందిన ఖుష్బు శర్మ(32) హైదరాబాద్‌లోని గూగుల్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. ఆమెకు ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో నెల్లూరుకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో మనోజ్‌ను తన ఇంటి వద్దకు రమ్మని చెప్పింది, రాకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అతడు రాకపోవడంతో ఖుష్భు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

  ‘పుష్ప 2’ కొత్త షెడ్యూల్!

  ‘పుష్ప 2 ది రైజ్’ చిత్రంపై తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంకి సంబందించిన షూటింగ్ పై క్లారిటీ వచ్చింది. రేపటి నుండి ఈ సినిమాకి సంబందించిన కొత్త షెడ్యూల్ ఒకటి స్టార్ట్ కానుందని సమాచారం. హైదరాబాద్‌లో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. అయితే దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

  భార్యపై అనుమానంతో భర్త హత్య

  హైదరాబాద్‌ చంపాపేట్‌లో జరిగిన స్వప్న (20) హత్యకేసులో మిస్టరీ వీడింది. భర్త ప్రేమ్‌కుమార్‌ ఆమెను హత్య చేసినట్లు పోలీసుల నిర్ధారించారు. భార్య మరోకరితో చనువుగా ఉండటం చూసి కోపంతో భార్త వారిద్దరిపై దాడి చేశాడు. ఇంట్లోని కత్తితో భార్య గొంతుకోశాడు. కళ్లెదుట స్నేహితురాలు రక్తపుమడుగులో పడిపోవడంతో యువకుడు ప్రేమ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కుమార్‌ను మేడమీద నుంచి కిందకు తోశాడు. అనంతరం ఆ యువకుడు అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన నింధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  మహిళకు మత్తుమందు ఇచ్చి బంగారం చోరి

  మహిళకు మత్తుమందు ఇచ్చి కొందరు దుండగులు నగలు దోపిడీ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మధురానగర్‌లో చోటుచేసుకుంది. ఓ మహిళ భర్తలో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు దుండగులు ఆమె వద్దకు వెళ్లి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చారు. దీంతో కూల్‌డ్రింక్ తాగి ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు సదరు మహిళ మెడలోని బంగారాన్ని లాక్కెళ్లిపోయారు. అనంతరం బాధిత మహిళ భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

  తమ్ముడిని నరికి చంపిన అన్న

  హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్యను వేధిస్తున్నాడన్న అనుమానంతో అన్న తమ్ముడిని హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. షబ్బీర్‌ అహ్మద్‌ తన భార్యను తమ్ముడు సాజిద్‌ వేధిస్తున్నాడని అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తమ్ముడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు గల కారణాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. సాజిద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

  ప్రియుడు మృతి..ప్రేయసి ఆత్మహత్య

  hyd: గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మరణవార్త విని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. నేహా అనే యువతి (19) స్థానికంగా కేఫ్‌లో పనిచేస్తుంది. అదే కేఫ్‌లో పనిచేస్తున్న సహా ఉద్యోగి సల్మాన్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో సల్మాన్‌..తన నివాసంలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన వ్యక్తి మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆమె ఉంటున్న హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

  చంద్రబాబు అరెస్టుపై ఐటీ ఉద్యోగులు నిరసన

  టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేశారు. నగరంలోని విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అక్రమ కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. ఆయనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటామని ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు చేపట్టిన యామ్‌ విత్‌ సీబీఎన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉద్రిక్తత నెలకొంది. … Read more

  ఆకలితో అలమటిస్తున్న యువతి

  మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి అక్కడ రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి భారత్‌కు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాసింది. మిన్హాజ్ జైదీ మాస్టర్స్ చేసేందుకు 2021లో అమెరికా వెళ్లింది. వస్తువులు ఎవరో దొంగిలించడంతో ఆమె చికాగో రోడ్లపై ఆకలి కడుపుతో తిరుగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిన కొందరు జైదీని గుర్తించి తల్లికి సమాచారం అందించారు. దీంతో తన కుమార్తెను భారత్‌కు రప్పించేందుకు ఆమె తల్లి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. Syeda … Read more