అడుగు వేయలేకున్నా నెట్ సాధించింది
తన పట్టుదలతో అంగవైకల్యాన్ని ఆమడ దూరాన నిలబెట్టింది. సాయం లేనిదే అడుగైనా వేయలేని ఆమె..జీవితంలో అతిపెద్ద అడుగు వేసింది. జాతీయ అర్హత పరీక్ష (NET)లో 99.31 శాతం స్కోర్ సాధించి ఔరా అనిపించింది. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని శాంతిపూర్‌కు చెందిన పియాషా మహల్దార్ దివ్యాంగురాలు. 3 అడుగుల పొడవు మాత్రమే ఉంటుంది. తాను కదల్లేకపోయినా చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి. యూజీసీ నెట్‌ను కంప్యూటర్ ముందు బోర్లా పడుకుని రాసి, బెంగాలీ విభాగంలో 99.31 శాతం స్కోర్ సాధించింది.