• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఆడేది సింపతి గేమ్: అమర్నాథ్

    టీడీపీ అధినేత చంద్రబాబు సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు వెల్ నెస్ సెంటర్‌లో కాదు జైల్లో ఉన్నారు.. నేరం చేసినవాళ్లు ఉండేందుకే జైళ్లను పెట్టింది. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టిన జైళ్లలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య ఇబ్బందులపై ప్రచారంతో సింపతీ కోసం చంద్రబాబు గేమ్ ఆడుతున్నారు అని ఆరోపించారు.

    నేడు సీఐడీ విచారణకు నారా లోకేష్

    సీఐడీ ముందు రెండో రోజు విచారణకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. ఐఆర్ఆర్ కేసులో ఏ14 గా ఉన్న లోకేష్‌ను నిన్న ఆరు గంటల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉందని మరోసారి 41ఏ నోటీసు ఇచ్చారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ ఆఫీసుకు లోకేష్ రానున్నారు. మరోవైపు నిన్న జరిగిన విచారణలో కేసుతో సంబంధం లేని ప్రశ్నలను అధికారులు అడిగారని ఆరోపించారు.

    నేడు చంద్రబాబు పిటిషన్ విచారణ

    నేడు ఏపీ హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) కేసు, అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు వేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. అటు ఏసీబీ కోర్టులో IRR, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ వేసిన పిటి వారెంట్లపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

    నేడు ఈడీ ఎదుట నవదీప్ హాజరు

    హైదరాబాద్‌- నేడు ఈడీ ఎదుట హీరో నవదీప్ హాజరుకానున్నారు. మధాపూర్ డ్రగ్స్ కేసులో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు పరిచయాలు ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. వీరితో జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది.

    సిట్ ఆఫీస్‌కు నారా లోకేష్

    కాసేపట్లో సిట్ ఆఫీసుకు నారా లోకేష్ వెళ్లనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు లోకేష్‌ను విచారించనున్నారు. ఐఆర్‌ఆర్‌ కేసులో ఏ-14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. మంత్రిగా లోకేష్ ఉన్న సమయంలో భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ.

    ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ

    అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దేవినేని ఉమ ఇతర టీడీపీ నేతలకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విచారించిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారాయణ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.