ఆ కారణంతో స్టార్ హీరో మూవీ మిస్: ఇవానా
ఒకే ఒక్క కారణంతో ఓ బిగ్ హీరోతో నటించే ఛాన్స్ కోల్పోయానని ‘LGM’ ఫేమ్ ఇవానా తెలిపింది. ‘‘కన్నడలో ఓ బిగ్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ చివరి నిమిషంలో హీరో పక్కన ఎత్తు సరిపోనని తీసేశారు. ఈ కారణంతో మరికొన్ని సినిమాలు కూడా కోల్పోయాను. లవ్ టుడే సినిమా సమయంలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. పొట్టిగా ఉన్నానని ఎగతాళి చేసేవారు. ప్రస్తుతం ఆ బాధల నుంచి కోలుకుంటున్నా.’’ అంటూ ఇవానా చెప్పుకొచ్చింది.