• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బలమైన టెలికాం బ్రాండ్‌గా జియో

  దేశంలో అత్యంత శక్తివంతమైన టెలికాం బ్రాండ్‌గా జియో నిలిచినట్లు టీఆర్ఏ తెలిపింది. జియో తర్వాత ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ నిలిచాయి. కాగా దుస్తుల విభాగంలో అడిదాస్, ఎలక్ట్రానిక్స్‌లో ఎల్‌జీ, వాహనాల్లో బీఎండబ్ల్యూ, బ్యాంకింగ్‌లో ఎస్బీఐ, ఆహార ఉత్పత్తుల్లో అమూల్, ఎఫ్ఎంసీజీలో ఫాగ్ స్ప్రే, విద్యుత్ ఉత్పత్తుల్లో ఫిలిఫ్స్, ఆరోగ్య ఉత్పత్తుల్లో హిమాలయ, రిటైల్‌లో కేఎఫ్‌సీ, ఇంటర్నెట్ బ్రాండ్లలో అమెజాన్, మెబైల్ ఫోన్లలో ఎంఐ ఫోన్లు ముందు వరుసలో ఉన్నట్లు వెల్లడించింది.

  JIO: 4జీ ధరలకే.. 5జీ ప్లాన్స్

  రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. 5G ప్లాన్స్‌ను 4G రేట్లకే అందిస్తామని ప్రకటించింది. 4G రేట్ల కంటే ఎక్కువ వసూలు చేయమని వెల్లడించింది. 5G సేవల విలువను గుర్తించే వరకు కొత్త ధరలను అమలు చేసే ఆలోచన లేదని సంస్థలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉంటే.. జియో 5G సేవలు ప్రధాన మెట్రోపాలిటిన్ నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో దీపావళి కల్లా అందుబాటులోకి తేనున్నట్లు ఇటీవల వెల్లడించింది.

  1GBPS స్పీడు.. UNLIMITED కాలింగ్

  అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో 1GBPS స్పీడుతో ప్రీపెయిడ్ యూజర్లకు జియో ఫైబర్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తోంది. వీటితో పాటు ఓటీటీ ప్లాట్‌ఫాంల స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్‌నీ వినియోగదారుడికి సమకూరుస్తోంది. జియో ఫైబర్ నెలవారీ ప్లాన్‌లు రూ.999 నుంచి మొదలుకొని.. రూ.8,499వరకు అందుబాటులో ఉన్నాయి. 150MBPS నుంచి 1GBPS వేగంతో ఇవి ఉన్నాయి. ఆయా ప్లాన్‌లకు అనుగుణంగా అమెజాన్ ప్రేమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, వూట్ తదితర ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను జియో అందిస్తోంది.

  దీపావళి నుంచే జియో 5జీ సేవలు

  రిలయన్స్‌ జియో తమ 5జీ సేవలను వచ్చే రెండు నెలల్లో ప్రారంభించబోతున్నట్లు సంస్థ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ ప్రకటించారు. 45వ వార్షిక సమావేశంలో అంబానీ ఈ మేరకు ప్రకటన చేశారు. 100 మిలియన్ల గృహాలకు 5జీ సేవలు విస్తరించబోతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద 5జీ నెట్‌వర్క్‌గా జియో అవతరించబోతోందని అంబానీ పేర్కొన్నారు. దేశమంతా 5జీ సేవల కోసం రూ.2లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వివరించారు. దీపావళికి కొన్ని పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభిస్తామని, డిసెంబర్‌ 2023 కల్లా దేశమంతా విస్తరిస్తామని ఆయన వివరించారు.

  కొనసాగుతున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం

  5జీ స్పెక్ట్రమ్ వేలం కొనసాగుతోంది. నిన్న సాయంత్రం వరకు 23 రౌండ్లకు గాను రూ.1,49,855 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి.కంపెనీల మధ్య పోటీతో ఇవాళ కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరో రెండు రోజుల పాటు ఈ వేలం కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఈస్ట్ సర్కిల్‌‌లోని 1800MHZ స్పెక్ట్రమ్ కోసం జియో,ఎయిర్‌‌టెల్ సంస్థలు తీవ్రంగా పోటి పడ్డాయి. 5జీ స్పెక్ట్రమ్ కోసం ప్రస్తుతం తక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (600MHZ, 700MHZ, 800MHZ, 900MHZ, 1800MHZ, 2100MHZ​, 2300MHZ) ఈ-వేలం జరుగుతోంది.

  టెలీకాం రంగంలోకి అదానీ?

  ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ 5జీ స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. టెలీకాం రంగంలో తిరుగులేని శక్తిగా ఉన్న అంబానీ- జియోను ఢికొట్టేందకు ఆయన ఈమేరకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు 5జీ స్పెక్ట్రం వేలం ఈనెల 26న ప్రారంభం కానుంది. ఇప్పటివరకు ఎన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయే కేంద్రం త్వరలో వెెల్లడించనుంది. గుజరాత్ కు చెందిన అంబానీ, అదానీ ఇప్పటివరకు ఒకేరంగంలో పోటీ పడింది లేదు.

  జియో ఫోన్ నెక్ట్స్‌పై రూ.2000 ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్

  జియో ఫోన్ నెక్ట్స్‌పై కంపెనీ ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఏదైనా 4జీ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసి ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2000 డిస్కౌంట్ ల‌భిస్తుంది. జియో ఫోన్ నెక్ట్స్ ధ‌ర ప్ర‌స్తుతం రూ.6,499గా ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌తో కొనుగోలు చేస్తే రూ.4,499కే ల‌భిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోనును రూ.2000 చెల్లింపు చేసి కొనుగోలు చేయ‌వ‌చ్చు. మిగ‌తా మొత్తం వ‌చ్చే 18 నెల‌లు లేదా 24 నెల‌ల వ‌ర‌కు చెల్లించే అవ‌కాశం ఉంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫ‌ర్‌పై కూడా ఇది వ‌ర్తిస్తుంది.