• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేసీఆర్‌ను ఎందుకు గద్దే దించాలి: కేటీఆర్

    టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని విమర్శించిన రేవంత్‌కు ఇప్పుడు ఆమె దేవత అయిందా? కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే 11 సార్లు ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ ఏం చేసింది? కేసీఆర్‌ను గద్దే దించాలని అంటున్నారు. రైతులకు రైతు బంధు ఇచ్చినందుకు గద్దే దించాలా? ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి ఇచ్చినందుకు దింపాల? ఆసరా పెన్షన్లు పెంచినందుకు దించాలా? ఎందుకు దించాలి’ అని ప్రశ్నించారు.

    బండి సంజయ్‌ మండిపడ్డ కేటీఆర్

    కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై మండిపడ్డారు. ‘హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టే సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బతిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడు. ఎంపీ అయ్యాక ఏం చేశారు. ఓ బడి తేలేదు. కనీసం గుడి అయినా తేలేదు. మోడీ దేవుడని అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో.. గంగుల కమలాకర్‌ మీద పోటీ అంటే పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే’ అని … Read more

    110 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు దక్కవు: కేటీఆర్

    అబద్దాల అమిత్ షా పార్టీకి తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘అమిత్ షా ప్రసంగం ఆసాంతం అబద్ధాలే. అమిత్ షా- మోదీ ఎన్ని అబద్ధాలు ఆడిన తెలంగాణలో బీజేపీకి ప్రజల చేతుల్లో తిరస్కారం తప్పదు. మళ్లీ ఎన్నికల్లోనూ 110 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం. పరివార్ వాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

    బీజేపీ అలా చేస్తే పోటీలో ఉండం: కేటీఆర్

    మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ‘నల్గొండ జిల్లా అభివృద్ధికి బీజేపీ రూ.18 వేల కోట్లు ఇస్తే టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుంది. మిషన్ భగీరథ పథకంతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ లేకుండా చేశాం.ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేయని వాళ్లు ఎవరికీ భయపడరు. తెలంగాణ మోడల్‌తో దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నాం. బరాబర్ వెళ్తాం’ అని స్పష్టం చేశారు.