లాలూకు సీబీఐ ఝలక్
బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్కు సీబీఐ మరోసారి ఝలక్ ఇచ్చింది. లాలూ యూపీఏ 1 హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కూడా 2021లోనే ముగిసింది. కానీ ఇటీవల ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో లాలూపై మళ్లీ సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో లాలూ ఫ్యామిలీ మొత్తం నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం లాలూ బెయిల్పై విడుదలై విశ్రాంతి తీసుకుంటున్నాడు.