• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘లియో’ డివైడ్‌ టాక్.. డైరెక్టర్‌ ఏమన్నారంటే!

    లియో సినిమాపై నెటిజన్ల నుంచి వస్తోన్న మిశ్రమ స్పందనలపై డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు. వాళ్ల నుంచి వచ్చే కామెంట్స్‌ను విశ్లేషించుకుంటానన్నారు. ప్రేక్షకుల అభిప్రాయం కోసం మరికొన్ని రోజులు తాను ఎదురుచూస్తానని చెప్పారు. తదుపరి చిత్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి రజనీకాంత్‌ సినిమా పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. కాగా, లియో చిత్రం బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తొలి రోజే ఏకంగా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

    VD 13 టైటిల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

    పరుశురామ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ- మృణాల్ ఠాకూర్ జంటగా VD13 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి లెటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ను అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అదికూడా తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

    ‘ఫస్ట్‌ 10 నిమిషాలు అస్సలు మిస్‌ కావొద్దు’

    సరిగ్గా ఐదు రోజుల్లో రిలీజ్‌ కాబోతున్న లియో చిత్రంపై విజయ్‌ ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఓ క్రేజీ అప్‌డేట్‌ బయపెట్టాడ. ఈ మూవీలో ఫస్ట్‌ పది నిమిషాలు అస్సలు మిస్సవ్వద్దని సూచించారు. సినిమాకు సోల్ అదేనని చెప్పుకొచ్చాడు. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌లో సినిమాపై ఉన్న ఆసక్తి మరింత పెరిగిందని చెప్పవచ్చు.

    విజయ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం

    కోలీవుడు స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీ ట్రైలర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌ను చెన్నైలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంతో అభిమానులు అసహనానికి గురైయ్యారు. ఈ క్రమంలో థియేటర్లోని సీట్లను విరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. https://twitter.com/ManobalaV/status/1709938471673155614/video/1

    ‘లియో’గా వస్తోన్న తలపతి విజయ్

    తమిళ్ స్టార్ హీరో తలపతి విజయ్ ‘లియో’గా వస్తున్నాడు. సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ‘లియో; బ్లడీ స్వీట్’గా వస్తోంది. ఈ మేరకు సినిమా యూనిట్ టైటిల్‌ను రివీల్ చేసింది. ఈ టైటిల్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ జమ్ము కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.