ఉత్తర కొరియాలో లాక్డౌన్? కరోనాతో కాదు !
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయాలు సంచలనం అవుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. ఆ దేశంలోని ప్యాంగ్యాంగ్లో ఐదు రోజుల సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అయితే… అది కరోనా కారణంగా కాదు. అక్కడి ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుండటంతో నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండి ఎప్పటికప్పుడు శరీర ఉష్ణోగ్రతలు నివేదించాలని ఆదేశించారు. వారు తీవ్రమైన జలుబుతో బాధఫడుతున్నారని సమాచారం.