తండ్రి నిర్లక్ష్యానికి.. రెండు ప్రాణాలు బలి
ములుగు జిల్లా మంగపేట సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం చెందగా తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ తండ్రి ఇద్దరు కుమారులు, భార్యను బైక్పై ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ TSRTC బస్సుకు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఉద్దేశిస్తూ TSRTC ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్ పై సరైన అవగాహన లేకపోవడం ప్రమాదాలకు కారణం. రహదారులపై వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. … Read more