‘తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ’
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు 10 హామీలు ఇచ్చారు. ఢిల్లీ నగరం సుందరీకరణ, తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ, వ్యాపారులకు ఆన్లైన్లోనే లైసెన్స్ మంజూరు, నగరంలోని వీధులు, రోడ్లు శుభ్రం, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, వీధి వ్యాపారుల కోసం వాణిజ్య జోన్లు, ఢిల్లీలో ఆవులు, కుక్కలు, కోతుల బెడద నుంచి విముక్తి, శుభ్రమైన పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కుల సుందరీకరణ, పాఠశాలలు, ఆస్పత్రుల్లో వసతుల మెరుగు వంటి హామీలు కేజ్రీవాల్ గుప్పించారు.