యువ రైతు సెల్ఫీ వీడియో.. అదృశ్యం..
తన భూమిని వైఎస్సార్సీపీ నాయకులు లాక్కోవాలని చూస్తున్నారని.. అదే జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పాతపాడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పెంచల నరసింహారెడ్డికి.. బెంగళూరుకు చెందిన డి.పట్టాభిరామిరెడ్డికి భూతగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతల సాయంతో పట్టాభిరామిరెడ్డి.. నరసింహారెడ్డి పొలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. దీంతో నరసింహారెడ్డి సెల్ఫీ వీడియో తీసి అజ్ణాతంలోకి వెళ్లాడు. తన చావుకు పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులే అంటూ వీడియోలో పేర్కొన్నాడు.