భువనేశ్వరి యాత్రపై రోజా సెటైర్లు!
AP: నేటి నుంచి నారా భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో యాత్రపై రాష్ట్ర పర్యాటక మంత్రి రోజా సెటైర్లు వేశారు. ఇది బస్సు యాత్ర కాదని, ఫ్యాషన్ షో అని ఎద్దేవా చేశారు. లోకేశ్ నిజం గెలిస్తే చంద్రబాబు జైల్లోనే ఉంటారని అన్నారు. ఆయనతో పాటే లోకేశ్, భువనేశ్వరి కూడా జైలుకు వెళ్లే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై, ఇన్నర్ రింగ్ రోడ్డుపై సీబీఐ విచారణ కోరాలని సూచించారు.