• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైకాపాకు షాక్‌; మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా గెలుపు

    ఏపీలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడగా, పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురము-కర్నూలు) నియోజకవర్గం ఫలితం తాజాగా వెల్లడైంది. వైకాపా అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గెలుపొందారు. ఈ స్థానంలో మొత్తం 49మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

    ఇది ప్రజావిజయం, మార్పునకు సంకేతం: చంద్రబాబు

    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజేతలను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఈ ఫలితాలు ప్రజావిజయం, మార్పునకు సంకేతమని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల తీర్పు.. మంచికి మార్గం, రాష్ట్రానికి శుభసూచకమన్నారు. తెదేపా అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైకాపా అక్రమాలకు ఎదురొడ్డి నిలిచిన పార్టీ శ్రేణులకు సెల్యూట్‌ చేస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెదేపా స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

    ఎమ్మెల్సీ ఫలితాలను హెచ్చరికగా భావించట్లేదు: సజ్జల

    ఏపీ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తెదేపా సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను హెచ్చరికగా భావించడం లేదన్నారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని, ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. 3 పట్టభద్రుల స్థానాల ఎన్నికల్లో రెండు చోట్ల తెదేపా గెలవగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైకాపా, తెదేపా అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.