పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్!
అన్ని పాఠ్య పుస్తకాల్లోనూ ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ప్రవేశపెట్టాలని NCERT నిర్ణయించింది. పాఠశాల పాఠ్య ప్రణాళికలో మార్పుచేర్పుల కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది. పాఠ్యపుస్తకాల్లో ‘ప్రాచీన చరిత్ర’కు బదులుగా ‘క్లాసికల్ హిస్టరీ’ని ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసినట్టు కమిటీ చైర్పర్సన్ సి.ఇసాక్ తెలిపారు. ముఖ్యంగా ఇండియా పేరును అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్‌గా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్లు స్పష్టం చేశారు. 7 వేల ఏళ్లనాటి గ్రంథాల్లోనే భారత్ పేరు ఉన్నట్లు చెప్పారు.