వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఆ వివరాలు ట్రాక్ చేయలేరు!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గుర్తు తెలీని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ను రింగ్ అవ్వకుండా సైలెన్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ సమయంలో లొకేషన్, ఐపీ అడ్రస్ వివరాలు అవతలి వారికి తెలీకుండా చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొందరికి అందుబాటులోకి వచ్చింది.. ఈ ఫీచర్ యాక్టివేట్ చేయాలంటే త్రీడాట్స్ మెనూలోని ప్రైవసీలోకి వెళ్లాలి. ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి.