చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు
ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్లలో కిలో ఉల్లిని రూ.60-70కి విక్రయిస్తున్నారు. దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల రాకపోకలు దాదాపు 40% పడిపోయాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. నవంబరు రెండో వారం వరకూ ఈ పరిస్థితులు ఉండొచ్చని అభిప్రాయపడ్డాయి.