• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పులి, సింహం మధ్యలో క్రిష్

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌స్టార్‌ రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో దూసుకెళ్తోంది. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల గురించి బాలయ్య సూటి ప్రశ్నలు వేశాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ కూడా అతిథిగా వచ్చాడు. తమ ఇద్దరిలో కనిపించిన తేడా ఏంటి అని ప్రశ్నించగా… పులి, సింహం మధ్యలో నా తల ఉందంటూ చమత్కరించాడు. ఏపీ సర్కారుపై, అధికారులపై జనసేనాని విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది.

    ఆహాలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డ్

    ‘అన్‌స్టాపబుల్’ రెండో సీజన్‌లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి ఆహా దద్దరిల్లింది. అత్యధిక వేగంగా 100 మిలియన్(10కోట్లు) నిమిషాల పాటు స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్‌గా రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 2న రాత్రి 9గంటలకు పవన్ కళ్యాణ్‌ ఎపిసోడ్‌లోని తొలి పార్ట్‌ని ప్రసారం చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. వాటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఆశ్చర్యకర సమాధానాలు వెల్లడించారు. దీంతో చాలామంది ఆసక్తితో ఎపిసోడ్‌‌ని పూర్తిగా తిలకించారు.

    పవన్ ఎపిసోడ్; ‘ఆహా’కు టెన్షన్

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి పవన్ ఎపిసోడ్ నేడు స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ [ఆహా](url)లో ప్రసారం అవుతుంది. ఈ ఎపిసోడ్‌కు దాదాపు 2 మిలియన్ల మంది యూజర్ల ట్రాఫిక్ ఉండొచ్చని ఆహా అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సర్వర్ క్రాష్ అవ్వకుండా ఆహా ముందు జాగ్రత్తగా ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. అదనపు సర్వర్లు ఏర్పాటు చేసుకుంటోంది. సర్వర్ థ్రెషోల్డ్‌లను మరింత మెరుగుపరుస్తోంది. ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసింది. Server threshold pencham, Backup servers pedutunnam … Read more

    ఒక రోజు ముందుగానే బాలయ్య, పవన్ ఎపిసోడ్

    ‘ఆహా’లో ప్రసారం కానున్న బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ షో ఎపిసోడ్‌పై ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే విడుదలైన టీజర్‌కి భారీగా స్పందన లభించింది. అయితే, ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెబుతూ ఆహా కీలక ప్రకటన చేసింది. ఒకరోజు ముందుగానే పవర్ ఎపిసోడ్‌ని ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 2న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. తొలుత ఫిబ్రవరి 3న ఎపిసోడ్‌ని విడుదల చేయాలని భావించింది. ఫ్యాన్స్ ఆసక్తి, కోరిక మేరకు ఆహా ఒక రోజు ముందుకు జరిపింది.

    యూట్యూబ్‌లో ‘పవర్’ ప్రోమో సునామీ

    బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోంది. ప్రోమో విడుదలైన 18 గంటల్లోనే 3మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్‌ పార్ట్ 1ని ఫిబ్రవరి 3న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి బాలయ్య ఆరా తీశారు. త్రివిక్రమ్‌తో స్నేహం, చరణ్ పెంపకం వంటివాటి గురించి పవన్ సరదాగా ఆన్సర్ చేశారు.

    పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.

    పవన్, బాలయ్య అన్‌స్టాపబుల్ ప్రొమో

    బాలయ్య అన్‌స్టాపబుల్‌లో పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రొమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో ఇద్దరు హీరోలు హంగామా చేశారు. పవన్‌పై బాలయ్య ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ ఎపిసోడ్‌లో సాయిధరమ్ తేజ్‌ కూడా పాల్గొన్నాడు. మధ్యలో రామ్‌ చరణ్‌కు ఫోన్ చేసి మరీ నవ్వించాడు బాలయ్య. పవన్ వివావాలకు సంబంధించి కూడా బాలయ్య ప్రశ్నించారు.

    పవన్-బాలయ్య ఎపిసోడ్; సెన్సేషనల్ రెస్పాన్స్

    నందమూరి నటసింహం హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. పవన్, బాలయ్యలను ఒకే వేదికపై చూసేందుకు కళ్లు సరిపోవటం లేదని ప్రేక్షకులు అంటున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ ట్రెండింగ్‌గా మారింది. యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధించింది. ఇక ఈ సాలిడ్ ఎపిసోడ్ ఆహాలో త్వరలోనే రిలీజ్ కానుంది.

    ‘వాల్తేరు వీరయ్య’ వీక్షించిన వైసీపీ ఎమ్మెల్యే

    AP: శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు చురకలంటించారు. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలంటూ పరోక్షంగా విమర్శించారు. వాల్తేరు వీరయ్య సినిమాను వీక్షించిన అనంతరం మధుసూధన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చిన్నప్పటి నుంచి అభిమానిగా సినిమాలు చూస్తున్నాం. ఇప్పుడు కార్యకర్తలతో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా చూడటం ఆనందంగా ఉంది. అన్నదమ్ముల అనుబంధంతో సినిమా చాలా బాగుంది. అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ నెట్టింట్లో … Read more

    తమ్ముడి నెంబర్‌ని చిరు ఎలా ఫీడ్ చేశాడంటే?

    ‘సుమ అడ్డా’కు వచ్చిన వాల్తేరు వీరయ్య టీం షో లో సందడి చేసింది. చిరంజీవి ఉత్సాహంగా కనిపించారు. సుమ అడిగిన ప్రశ్నలకు వెంటవెంటనే సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కాంటాక్టుని ఫోన్‌లో ఏ విధంగా సేవ్ చేసుకున్నారని సుమ చిరంజీవిని అడిగింది. దీంతో ‘పవన్ కళ్యాణ్, పీకేలా కాకుండా.. కళ్యాణ్‌బాబు అని సేవ్ చేసుకున్నా’ అంటూ చిరంజీవి బదులిచ్చారు. అనంతరం భార్య సురేఖ నెంబర్‌ ‘రే’ అని ఉంటుందని, కుమారుడు రాంచరణ్ కాంటాక్టుని ‘చెర్రీ’ అంటూ సేవ్ చేసుకున్నట్లు వెల్లడించారు.