• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గబ్బర్‌సింగ్ చరిత్ర రిపీటెడ్: హరీష్ శంకర్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ సినిమా గ్లింప్స్‌ గురించి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మళ్లీ గబ్బర్ సింగ్ చరిత్ర రిపీట్ చేద్దాం అంటూ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపారు. గబ్బర్‌సింగ్ రిలీజైన 11 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌ను ఈరోజు సా.4.59కు మేకర్స్ విడుదల చేస్తున్నారు. Forever indebted …. Lets Repeat the History ??? https://t.co/D3vojPwjhQ — Harish … Read more

    పవన్, సాయిధరమ్ సినిమా పేరు BRO !

    పవన్ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన వినోదయ సిత్తమ్ రీమేక్‌ టైటిల్‌ గురించి క్రేజీ టాక్ నడుస్తోంది. ఈ చిత్రానికి BRO అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవర్‌స్టార్‌ను సాయిధరమ్ ఎక్కువగా బ్రో అని పిలుస్తుంటాడట. అందుకే దర్శకుడు సముద్రఖని వినూత్నంగా ఆలోచించి అదే టైటిల్‌గా పెడితే బాగుంటుందని భావించాడు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. ఇక ఈ క్రేజీ టైటిల్‌పై సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. అదిరిపోయిందంటూ కామెంట్స్ వస్తున్నాయి. It's super #Bro ?#PKSDT pic.twitter.com/eVreQskdr9 … Read more

    తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి; పవన్

    [వీడియో: ](url)తెలంగాణ ప్రజలకు వైఎస్సార్‌సీపీ క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడటం దారుణమన్నారు. వారిని కించపరిచేలా మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు. ఏపీలోని అధికార పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ నేతల వైఖరి తనకు బాధ కలిగించిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకు వైసీపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి pic.twitter.com/s3OGDfF1mM — JanaSena Party (@JanaSenaParty) April 16, 2023

    #OG: FireStorm మొదలైంది…!

    పవన్‌ కల్యాణ్-సుజీత్‌ కాంబినేషన్‌లో వస్తున్ గ్యాంగ్‌స్టర్‌ మూవీ OG షూటింగ్‌ మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో డైరెక్టర్‌ సుజిత్‌… క్లైమాక్స్‌ సీన్‌ను రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ నుంచి వస్తున్న సినిమాల్లో దీనిపైనే అభిమానులకు ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

    పవన్ సినిమాలో విలన్‌గా అవకాశం: మల్లారెడ్డి

    మేము ఫేమస్ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి క్రేజీ కామెంట్స్ చేశారు. తనకు పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్‌గా చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. డైరెక్టర్ హరీష్ శంకర్ తన దగ్గరకు వచ్చి ఒప్పించేందుకు గంటసేపూ బతిలాడారని వివరించారు. కానీ తాను విలన్‌గా చేయనని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ మూలాలపై నాలుగైదు సినిమాలు తీస్తానని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

    బైక్‌పై హల్‌చల్ చేసిన పవర్‌స్టార్

    [వీడియో; ](url)పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ బైక్‌పై హల్‌చల్ చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో ‘PKSDT’ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ అనంతరం తన హార్లీ డేవిడ్‌సన్ బైక్‌పై పవన్ నగర రహదారులపై చక్కర్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘PKSDT’ మూవీ షూటింగ్ హైటెక్ సిటీ పరిసరాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్లను ఇక్కడే తీస్తున్నట్లు తెలుస్తోంది. Ustaad @PawanKalyan Driving His Harley Davidson On #PKSDT Sets..??? pic.twitter.com/OpQLkRxOpF — … Read more

    పవన్ కళ్యాణ్‌కి అభినందనలు తెలిపిన నిర్మాత

    [VIDEO:](url) పవన్ సినీ, రాజకీయ జీవితంపై టాలీవుడ్ నిర్మాత ఏఎం రత్నం కీలక వ్యాఖ్యలు చేశారు. 27ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్‌కు శుభాభినందనలు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రత్నం కోరుకున్నారు. సినీ, రాజకీయ జీవితంలో జనసేనాని ప్రజల మన్ననలు చూరగొన్నారని కామెంట్ చేశారు. ఈ వీడియోను జనసేన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేసింది. కాగా, పవన్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’కు … Read more

    కన్నీళ్లు పెట్టుకున్న పూనమ్ కౌర్

    [VIDEO:](url) హీరోయిన్ పూనమ్ కౌర్ ఎమోషనల్ అయ్యింది. తాను తెలంగాణలో పుట్టానని..కానీ, తనను పంజాబీ అని నన్ను దూరం పెడుతున్నారని కంటతడి పెట్టుకుంది. టాలీవుడ్‌లో ముంబై నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కుతోందని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయం జరుగుతోందన్నారు. నిన్న రాజ్‌భవన్‌లో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో పూనమ్ పాల్గొంది. గవర్నర్ తమిళిసై ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు. నేను తెలంగాణలో పుట్టాను.. నేను తెలంగాణ బిడ్డనే నేను పంజాబీని అని, సిక్కుని అని.. మతం పేరు మీద నన్ను తెలంగాణ … Read more

    మాస్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్

    విరూపాక్ష టీజర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన పవన్ కళ్యాణ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెట్‌లో టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. టీజర్‌ను చూసిన పవన్‌… చిత్రబృందాన్ని అభినందించారు. ప్రతి సారి తనకు సపోర్ట్ చేస్తున్నందుకు సాయి ధరమ్‌ పవన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ టీజర్ రేపు విడుదల కానుంది.

    టీడీపీలో చేరొచ్చు కదా; పవన్‌కు బాలయ్య ప్రశ్న

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ 1 దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించి పార్ట్ 2 ప్రోమో రిలీజ్ అయింది. షోలో హోస్ట్ నందమూరి బాలకృష్ణ.. పవన్ కళ్యాణ్‌కు పలు ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా కొత్త పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. టీడీపీలో చేరవచ్చు కదా అని నేరుగా అడిగేశాడు. కారుపై ప్రయాణించడం ఏంటని అడిగాడు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 10 రిలీజ్ కానుంది.