• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవన్‌ తొలి పోస్టు వైరల్‌

    పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ తన ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌ పెట్టారు. సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సినీ ప్రముఖులతో దిగిన ఫొటోలను అందులో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో భాగమై ఎంతోమంది ప్రతిభావంతులతో ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉన్నానని వీడియో ప్రారంభంలో పవన్‌ అన్నారు. ఇక ఈ వీడియోను అభిమానులు, సెలబ్రిటీలు తెగ షేర్‌ చేస్తున్నారు. https://www.instagram.com/reel/Cut9Fehp89Z/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    పవన్‌వి తప్పుడు వ్యాఖ్యలు: అంబటి రాయుడు

    వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తప్పని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘‘ఏపీలో వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద జల్లుతారు. అలాంటివారిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలి. ప్రతి మనిషికీ ఏది అందాలో అది వలంటీర్ల ద్వారా అందుతోంది. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందించారు.’’ అంటూ రాయుడు చెప్పుకొచ్చారు. Volunteer System is brilliant, They are delivering to the last … Read more

    పవన్ సినిమాలో ‘స్పై’ హీరోయిన్!

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మూవీలో ‘స్పై’ హీరోయిన్ ఐశ్యర్య మీనన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యూటీ ‘ఓజీ’ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్. ‘స్పై’ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదరగొట్టినందుకే ఐశ్వర్యకు ‘ఓజీ’లో ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా పదేళ్ల క్రితం సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాలో ఐశ్వర్య ఓ కీలక పాత్ర పోషించింది. మళ్లీ ఇప్పుడు ‘స్పై’ మూవీలో నటించింది.

    యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బ్రో’

    తాజాగా విడుదలైన బ్రో టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో నం.1 స్థానంలోకి దూసుకెళ్లింది. 31 మిలియన్ ప్లస్ వ్యూస్ క్రాస్ చేసింది. 500K లైక్స్‌తో ట్రెండ్ అవుతోంది. వింటేజ్ మెనియాతో పవన్ మేనరిజం టీజర్‌లో అదిరిపోయింది. సాయిధరమ్ తేజ్, పవర్ స్టార్ నటించిన ‘బ్రో’ సినిమా ఈనెల 28న విడుదల కానుంది. టీజర్‌పై పాజిటివ్ టాక్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని సుముద్రఖని డైరెక్ట్ చేయగా.. తమన్ సంగీతం అందించాడు.

    నా ఓటు జనసేనకే: రాకేష్‌ మాస్టర్‌

    [VIDEO](url): ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ పవన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని మరణానికి ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ తెలిపారు. జనసేనకే తాను ఓటు వేస్తానని బహిరంగంగా ప్రకటించారు. జనసేనపై అభిమానంతో చేతిపై వేసుకున్న టాటూను చూపించారు. ఓటు వేసేటప్పుడు కులాలు పట్టించుకోనని స్పష్టం చేశారు. తాను రెడ్డి సామాజిక వర్గమైనా ఓటు మాత్రం పవన్ కళ్యాణ్‌కే వేస్తానని పేర్కొన్నారు. Om Shanti #RakeshMaster ? pic.twitter.com/StrItKoeWF — … Read more

    సభకొస్తారు.. కానీ ఓటెయ్యరు: పవన్

    AP: కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున సభకు వస్తారు కానీ ఓటెందుకు వేయట్లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా టికెట్ కోసం క్యూ లైన్లలో వేచి ఉండే ఓపిక ఓటు వేసేందుకు ఎందుకు ఉండట్లేదని ఆయన నిలదీశారు. ఏపీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నారు. జనవాణిలో కాకినాడ సమస్యలు వింటుంటే చాలా బాధ కలిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ మాఫియాగా మార్చేశారని ఆరోపించారు. సినిమా … Read more

    జూ.ఎన్టీఆర్‌ను ఆరాధిస్తాను: పవన్ కళ్యాణ్

    పిఠాపురం సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిత్ర పరిశ్రమలో నా తోటి హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. వారి సినిమాలు నేను తరచుగా చూస్తాను. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌, ప్రభాస్‌, చిరంజీవిగారిని ఆరాధిస్తాను. కేవలం తన సినిమాలతో ఇండస్ట్రీ మనుగడ సాధించలేదు. సినిమాల ద్వారా చాలమందికి ఉపాధి లభిస్తుంది. రాజకీయాలకు వచ్చేసరికి అభిమానాన్ని, కులాన్ని పక్కన పెట్టి మంచి చేసే నాయకులకు ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు. No matter who’s fan you … Read more

    #PKSDT మూవీ టైటిల్‌ ‘బ్రో’

    #PKSDT మూవీ టైటిల్‌ ‘బ్రో’(BRO) గా ఖరారు చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓ మోషన్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో పవన్ దేవుడి పాత్ర పోషించాడు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ సినిమాకు రీమేక్ ఇది. డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ ఆయనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ని అందించారు. తమన్ స్వరాలు సమకూర్చాడు. జులై 28న సినిమా విడుదల కానుంది.

    ఈసారి ఫర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది: ‘ఉస్తాద్’ గ్లింప్స్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ నుంచి టీజర్ గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ను ఉస్తాద్ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ గ్లింప్స్ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ‘ఈసారి ఫర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ రూపొందిస్తున్నారు. మైత్రీమూవీమేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

    పవన్‌ది అహంకారమా? అజ్ణానమా: హీరోయిన్

    పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి గరం గరమైంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ స్పెషల్ పోస్టర్‌పై ట్విటర్ వేదికగా ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. పవన్ కాళ్ల కింద భగత్ సింగ్ పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ‘‘ఇది ఖచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమే. దీనిని భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి. స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినా మర్యాద ఇవ్వాలి. భగత్ పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా.. అహంకారమా? అజ్ణానమా.’’అంటూ పూనమ్ మండిపడ్డారు. Courtesy Twitter: Mythri Movie Makers Screengrab … Read more