• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • PUSPHA2: ఊర్వశీ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్?

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ఓ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా స్టెప్పులేసింది. ఇందుకుగానూ ఊర్వశీ రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసినట్లు టాక్. ఈ పాట మూడు నిమిషాల నిడివి ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

    PUSPHA 2: లారీ ఫైట్ లీక్!

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఓ నదిలో ఎర్రచందనం దుంగలు ఉన్నలారీల మధ్య చేజింగ్ జరుగుతోంది. జీపుల్లో కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్ చూస్తుంటే ఇంటర్వెల్ ఫైట్‌లా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. #Pushpa2TheRule ???@alluarjun pic.twitter.com/wne5FhcEkX — అల్లుఅర్జున్ అన్న ?? (@AlluArjunCulttt) June 15, 2023

    ‘పుష్ప2’లో మెగా డాటర్!

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెగాడాటర్ నిహారిక కొణిదెల ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా ఆమె నో చెప్పగా నిహారిక నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

    ‘పుష్ప2’ స్పూఫ్: రబడ అదరగొట్టేశాడుగా!

    [వీడియో: ](url)పంజాబ్ కింగ్స్ స్టార్ బౌలర్ కగిసో రబడ ‘పుష్ప2’ స్పూఫ్‌తో అదరగొట్టాడు. ‘పుష్ప2’ చిత్రంలోని అల్లు అర్జున్ పాత్రను అనుకరిస్తూ ఓ వీడియో చేశాడు. ‘తగ్గేదెలే’ అంటూ పుష్పలోని అల్లు అర్జున్ మేనరిజం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రబడ మల్టీ టాలెంటెడ్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. కాగా రబడ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటి మూడు మ్యాచ్‌లలో అతడికి ఆడే అవకాశం రాలేదు. Rabada with a #Pushpa trademark.pic.twitter.com/nUiV4gEsvs … Read more