ఏపీలో త్వరలో జైలర్ సీన్: రఘురామ
సీఎం నిజ స్వరూపం ఏమిటో ప్రధానికి మోదీకి తెలిసిపోయిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ‘జైలర్’ సినిమా సీన్ త్వరలో రాష్ట్రంలో కనిపించవచ్చన్నారు. ఆ సినిమాలో రజినీకాంత్ తన కుమారుడు దొంగతనాలు చేస్తున్న విషయం తెలిసి అతన్ని చంపాలని ఆదేశిస్తారని..అలాగే రాష్ట్రంలోనూ రేపు అటువంటి దృశ్యమే పునరావృతం కావచ్చని అన్నారు. పీఎం కిసాన్ పథకానికి వైఎస్సార్ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిందని రఘురామ విమర్శించారు,