20 ఏళ్ల కుర్రాడిగా రామ్ !
బోయపాటి సినిమాలో ఎనర్జిటిక్ హీరో రామ్ సరికొత్తగా కనిపించనున్నాడని తెలుస్తోంది. సెకండాఫ్లో వచ్చే ఓ ఫ్లాష్ బ్యాక్ కోసం 20 ఏళ్ల కుర్రాడిగా చేస్తున్నాడట. రామ్ లుక్ అదిరిపోతుందని టాక్ వినిపిస్తోంది. యూఎస్ నేపథ్యంలో సాగే ఎపిసోడ్లో రొమాంటిక్ యాంగిల్లో తీయనున్నారని సమాచారం. చిత్రాన్ని పూర్తి ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా బోయపాటి తెరకెక్కిస్తున్నారు. రామ్ బాడీ లాంగ్వెజీకి తగ్గట్లుగా కథన్ ప్లాన్ చేశాడట దర్శకుడు. కచ్చితంగా హిట్ సాధిస్తుందని చిత్రబృందం భావిస్తోంది.