వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీ
ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే నెల (నవంబర్) నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కందిపప్పు అందించనున్నట్లు ప్రకటించింది. కిలో రూ.67 చొప్పున ప్రతీ కార్డుకు ఒక కేజీ కందిపప్పు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనుంది. వచ్చే నెల అవసరాలకు గాను 2,300 టన్నుల సరఫరాకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకూ పలుకుతోంది.